మంగళవారం 31 మార్చి 2020
Khammam - Feb 22, 2020 , 00:42:15

పట్టణ ప్రగతిలో అభివృద్ధి పనులు ప్రారంభించాలి..

పట్టణ ప్రగతిలో అభివృద్ధి   పనులు ప్రారంభించాలి..

ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను పట్టణ ప్రగతిలో ప్రారంభించుకునేదుకు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

  • స్కై సైక్లింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలి
  • నూతనంగా మరో ఓపెన్‌ జిమ్‌ను ఏర్పాటు చేయాలి
  • కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌

ఖమ్మం, నమస్తే తెలంగాణ : ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను పట్టణ ప్రగతిలో ప్రారంభించుకునేదుకు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని లకారం ట్యాంక్‌బండ్‌, వైఎస్‌ఆర్‌నగర్‌, రోటరీనగర్‌, పెవిలియన్‌ గ్రౌండ్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను మున్సిపల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతితో కలిసి శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ పరిశీలించారు. లకారం ట్యాంక్‌బండ్‌ సుందరీకరణలో భాగంగా మొక్కలు నాటడం, లకారం ట్యాంక్‌బండ్‌ నుంచి గొరిల్లా పార్క్‌కు అనుసంధానం చేస్తూ నిర్మించిన వంతెన, ట్యాంక్‌బండ్‌ పనులను ప్రారంభించుకునేందుకు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్‌, గ్రీనరీ ఇంచార్జ్‌ శాఖల అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో పాటు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేస్తున్న స్కై సైక్లింగ్‌ పనులను కూడా సోమవారంలోగా పూర్తి చేయాలని జిల్లా పర్యాటక శాఖ అధికారిని ఆదేశించారు. లకారం ట్యాంక్‌బండ్‌ను మరింత సుందరీకరించేందుకుగాను అవసరమైన వివిధ రకాల మొక్కలను డివైడర్లలో, ట్యాంక్‌బండ్‌కు ఇరువైపుల రోడ్డు ప్రక్కన నాటేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత సూచించారు. ప్రస్తుతం ఉన్న ఓపెన్‌ జిమ్‌తో పాటు నూతనంగా మరో  ఓపెన్‌ జిమ్‌ను ఏర్పాటు చేయాలన్నారు.


అనంతరం వైఎస్‌ఆర్‌నగర్‌లో నిర్మాణాలు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 240 డబుల్‌ బెడ్‌రూమ్‌ గృహ సముదాయాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ గృహ సముదాయ కాలనీలో నీటి, విద్యుత్‌ వసతులను ఆయన పరిశీలించారు. ఈ సముదాయాన్ని పట్టణ ప్రగతిలో ప్రారంభించుకునేందుకు మిగిలి ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. రోటరీనగర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో పవర్‌ ఫైనాన్స్‌ నిధులతో చేపట్టిన అదనపు తరగతి గదులను ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని కలెక్టర్‌ ఆదేశించారు. పెవిలియన్‌ గ్రౌండ్‌లో నిర్మిస్తున్న బాస్కెట్‌బాల్‌ ఇండోర్‌ ఆడిటోరియాన్ని శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ పరిశీలించి పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ అధికారులను, జిల్లా క్రీడాభివృద్ధి అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీరు శ్యాంప్రసాద్‌, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పరంధామరెడ్డి, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ రంజిత్‌కుమార్‌, సెరీకల్చర్‌ గ్రీనరీ ఇంచార్జ్‌ అధికారి అనసూయ, జిల్లా విద్యాశాఖ అధికారి మదన్‌మోహన్‌, అర్భన్‌ తహసీల్దార్‌ శ్రీనివాసరావు, పంచాయతీరాజ్‌ ఈఈ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. logo
>>>>>>