శనివారం 28 మార్చి 2020
Khammam - Feb 19, 2020 , 23:17:56

ఆద్యంతం.. ఉత్కంఠ

ఆద్యంతం.. ఉత్కంఠ

ఇల్లెందు, నమస్తే తెలంగాణ:ఇల్లెందులో భ ద్రాద్రి కొత్తగూడెం కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రం లో ఉన్న 33 జిల్లాల నుంచి పురుషులు, మహిళల విభాగాలకు చెందిన 66 జట్లు క్రీడల్లో పాల్గొంటున్నాయి. బుధవారం జట్ల మధ్య పోటీ లు ఉత్కంటగా,ఉల్లాసంగా జరిగాయి. ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం,మహబూబాబాద్‌, ములు గు, వరంగల్‌ రూరల్‌ జిల్లాలనుంచి పెద్ద ఎత్తున క్రీడాభిమానులు తరలివచ్చారు. బరిలోకి దిగిన ఆయా జిల్లాల జట్లకు మద్దతుగా  కేరింతలు, ఈ లలు , చప్పట్లతో ప్రోత్సహించారు. డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ లు కావడంతో రాత్రి 6 గంటల తరువాత గ్రౌండ్‌ కిటకిటలాడిపోయింది. క్రీడాభిమానుల తో సందడిగా మారింది. బారికేడ్ల చుట్టూ బారు లు తీరారు. అర్ధరాత్రి 11 గంటల వరకు పోటీలను వీక్షించడం విశేషం. 


ఎప్పటికప్పుడు సమీక్ష.. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసి యేషన్‌ చైర్మన్‌ బానోత్‌ హరిసింగ్‌నాయక్‌ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను సమీక్షించారు. వేదికమీద నుంచి గ్రౌండ్లను పరిశీలిం చారు. గాయపడిన క్రీడాకారులను వెంటనే చికి త్స అందేలా వైద్యసిబ్బందిని అందు బాటు లో ఉంచారు. క్రీడాకారులకు ఎప్పటికప్పుడు వాటర్‌బాటిల్‌, మజ్జిగప్యాకెట్లను సరఫరా చేశారు. మొత్తం ఆరు గ్రౌండ్లలో జరుగు తున్న క్రీడలను పరిశీలిస్తూ ఏర్పాట్లను సమీక్షించారు. వలంటీర్లను అందుబాటులో ఉంచుతూ క్రీడాకారులకు కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేశారు. వచ్చిపోయే క్రీడాభిమానుల కోసం బారికేడ్ల చు ట్టూ కుర్చీలు, టెంట్లను ఏర్పాటు చేశారు. ఇద్దరు క్రీడాకారులు  గాయపడితే వాహనాల ద్వారా ఆస్పత్రికి  తరలించారు.


సౌకర్యాలు కల్పించాలి: ఎమ్మెల్యే హరిప్రియ

కబడ్డీ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియనాయక్‌ సూచిం చారు. బుధవారం కబడ్డీ పోటీల స్టేడియాన్ని సందర్శించారు. క్రీకారులకు వాటర్‌ బాటిల్‌, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం వేదిక నుంచి క్రీడా పోటీలను వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఇల్లెందులో జరుగడం చాలా సంతోషకరమైన విషయమన్నా రు. తద్వారా ఇల్లెందు కీర్తి , ప్రతిష్టలు రాష్ట్ర వ్యా ప్తంగా ఇనుమడింపజేసే అవకాశం లభించిందన్నారు.  క్రీడాకారులకు కల్పిస్తున్న సౌకర్యాలను అసోసియేషన్‌ చైర్మన్‌ బానోత్‌హరిసింగ్‌ నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. 


 వీక్షించిన ఎమ్మెల్యేలు..

కబడ్డీ పోటీలను మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియనాయక్‌లు వీక్షించారు. బుధవారం రాత్రి 8 గంటలకు సింగరేణి గ్రౌండ్లో జరుగుతున్న పోటీలను ఆసక్తిగా తిలకించారు. ఉత్కంఠభరితంగా కొనసాగే కబడ్డీ పోటీలను సుమారు గంట పాటు వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెలుపోటములను సహజంగా తీసుకోవాలన్నారు.ఓటమి గెలుపునకు నాంది అని క్రీడాకారులు గుర్తించాలన్నారు. ఇల్లెందులో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇల్లెందులో కబడ్డీ పోటీలు నిర్వహించడం ద్వారా మారుమూల ఏజెన్సీలో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందన్నారు. అంతే కాదు ప్రతీ ఒక్కరిలో క్రీడా చైతన్యం వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వస్తున్న క్రీడాభిమానులను చూస్తుంటే చాలా గర్వంగా ఉందన్నారు.  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ న్‌ దిండిగాల రాజేందర్‌, ఇల్లెందు మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్‌ చైర్మ న్‌ ఎస్‌డీ జాని, రాష్ట్ర రైతు సమన్వయ సమితి సలహాదారుడు పులిగళ్ళ మాధవరావు పాల్గొన్నారు.  


logo