గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Feb 19, 2020 , 01:46:54

ఉత్సాహంగా ఉత్కంఠగా..

ఉత్సాహంగా ఉత్కంఠగా..

రాష్ట్రస్థ్దాయి కబడ్డీ పోటీలు ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి. నువ్వా, నేనా అన్న రీతిలో వివిధ జిల్లాల జట్లు తలపడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇల్లెందులో జరుగుతున్న పోటీలు కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నారు.

  • ఇల్లెందులో కొనసాగుతున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
  • పోటాపోటీగా తలపడుతున్న జట్లు
  • మహిళా, పురుషుల విభాగంలో 35 జట్ల మధ్య లీగ్‌ మ్యాచ్‌లు
  • తరలివచ్చిన క్రీడాకారులు, అభిమానులు

ఇల్లెందు నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 18: రాష్ట్రస్థ్దాయి కబడ్డీ పోటీలు ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి. నువ్వా, నేనా అన్న రీతిలో వివిధ జిల్లాల జట్లు తలపడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇల్లెందులో జరుగుతున్న పోటీలు కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం రాత్రి వరకు మహిళా, పురుషుల విభాగంలో మ్యాచ్‌లు కొనసాగాయి. మంగళవారం రాత్రి వరకు మహిళా, పురుషుల విభాగంలో 35 జట్ల మధ్య లీగ్‌ మ్యాచ్‌లు జరిగాయి. 


మహిళా విభాగంలో..

మహిళా విభాగంలో సిద్దిపేట వర్సెస్‌ వరంగల్‌ రూరల్‌ జట్లు తలపడగా వరంగల్‌ రూరల్‌ విజయం సాధించింది. సూర్యాపేట, జగిత్యాల జట్లు తలపడగా సూర్యాపేట జట్టు విజయం సాధించింది. వరంగల్‌ రూరల్‌, జగిత్యాల జట్లు తలపడగా వరంగల్‌ రూరల్‌ విజయం సాధించింది. నల్గొండ, నాగర్‌కర్నూల్‌ జట్ల మధ్య ఆసక్తికర పోటీ జరుగగా నల్గొండ విజయం సాధించింది. జయశంకర్‌ భూపాలపల్లి , సిరిసిల్ల జట్ల మధ్య హోరాహోరీలో భూపాలపల్లి జట్టు విజయం సాధించింది. భూపాలపల్లి, నల్గొండ జట్ల మధ్య జరిగిన పోటీలో నల్గొండ జట్టు విజయం సాధించింది. రంగారెడ్డి, జోగుళాంబ గద్వాల్‌ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠపోరులో రంగారెడ్డి జట్టు విజయం సాధించింది. కామారెడ్డి, భువనగిరి జట్ల మధ్య జరిగిన పోరులో కామారెడ్డి విజయం సాధించింది. హైదరాబాద్‌, మహబూబాబాద్‌ జట్ల మధ్య జరిగిన పోటీలో హైదరాబాద్‌ జట్టు విజయం సొంతం చేసుకుంది. 


మేడ్చల్‌, నిర్మల్‌ జట్ల మధ్య జరిగిన పోరులో మేడ్చల్‌ జట్టు విజయం సాధించింది. ఖమ్మం, వరంగల్‌ అర్బన్‌ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠపోరులో ఖమ్మం అర్బన్‌ విజయం సాధించింది. వనపర్తి, ఆసీఫాబాద్‌ మధ్య జరిగిన ఆసక్తికర పోరులో వనపర్తి జట్టు విజయం సాధించింది. కరీంనగర్‌, మంచిర్యాల జట్ల మధ్య పోరులో మంచిర్యాల జట్టు విజయం సాధించింది. సంగారెడ్డి, ములుగు జట్ల మధ్య జరిగిన పోటీలో సంగారెడ్డి విజయకేతనం ఎగురవేసింది. పెద్దపల్లి, మెదక్‌ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో మెదక్‌ జట్టు విజయం సాధించింది. నిజామాబాద్‌, భువనగిరి జట్ల మధ్య జరిగిన పోరులో భువనగిరి జట్టు విజయకేతనం ఎగురవేసింది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భద్రాద్రి కొత్తగూడెం జట్టు విజయకేతనం ఎగురవేసింది. 


పురుషుల విభాగంలో..

పురుషుల విభాగంలో వికారాబాద్‌, ఖమ్మం జట్ల మధ్య జరిగిన పోరులో ఖమ్మం జట్టు విజయం సాధించింది. పెద్దపల్లి, మహబూబ్‌నగర్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ విజయం సాధించింది. రంగారెడ్డి, భువనగిరి జట్ల మధ్య జరిగిన పోరులో రంగారెడ్డి విజయం సొంతం చేసుకుంది. వరంగల్‌ రూరల్‌, భద్రాద్రి కొత్తగూడెం జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భద్రాద్రి కొత్తగూడెం విజయం సాధించింది. కరీంనగర్‌ , భద్రాద్రి కొత్తగూడెం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కరీంనగర్‌ విజయం సాధించింది. ఆదిలాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల జట్ల మధ్య జరిగిన పోరులో మేడ్చల్‌ జట్టు విజయం సాధించింది. నాగర్‌కర్నూల్‌, యాదాద్రి భువనగిరి జట్ల మధ్య జరిగిన ఉత్కంఠపోరులో నాగర్‌ కర్నూల్‌ విజయం సాధించింది. వరంగల్‌ అర్బన్‌, కామారెడ్డి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వరంగల్‌ అర్బన్‌ జట్టు విజయం సొంతం చేసుకుంది. 


సిద్దిపేట, ములుగు జట్ల మధ్య జరిగిన పోరులో సిద్దిపేట జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. వనపర్తి, రాజన్న సిరిసిల్ల జట్ల మధ్య జరిగిన ఉత్కంఠపోరులో సిరిసిల్ల జట్టు విజయం సొంతం చేసుకుంది. ఆసీఫాబాద్‌, సూర్యాపేట జట్ల మధ్య జరిగిన పోరులో సూర్యాపేట విజయం సొంతం చేసుకుంది. సంగారెడ్డి, పెద్దపల్లి జట్ల మధ్య జరిగిన పోరులో సంగారెడ్డి జట్టు విజయకేతనం ఎగురవేసింది. జోగుళాంబ గద్వాల్‌, నల్గొండ జట్ల మధ్య జరిగిన పోరులో జోగుళాంబగద్వాల్‌ జట్టు గెలుపు సొంతం చేసుకుంది. నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాల పల్లి జట్ల మధ్య జరిగిన పోరులో నిజామాబాద్‌ జట్టు విజయకేతనం ఎగురవేసింది. మెదక్‌, మంచిర్యాల జట్ల మధ్య జరిగిన పోరులో మెదక్‌ జట్టు విజయకేతనం ఎగురవేసింది. జగిత్యాల, హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠపోరులో హైదరాబాద్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. జనగాం, మహబూబ్‌నగర్‌ జట్ల మధ్య జరిగిన పోరులో మహబూబ్‌నగర్‌ జట్టు విజయకేతనం ఎగురవేసింది. రంగారెడ్డి, మహబూబాబాద్‌ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠపోరులో మహబూబాబాద్‌ జట్టు విజయం సాధించింది.


logo
>>>>>>