శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Khammam - Feb 18, 2020 , 00:21:36

జననేతకు పచ్చని హారం

జననేతకు పచ్చని హారం

కారేపల్లి, ఫిబ్రవరి 17: తెలంగాణ రాష్ట్ర సుపరిపాలనలో పాలకులకు రోల్‌మోడల్‌ సీఎం కేసీఆర్‌ అని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం సీఎం కేసీఆర్‌ 66వ పుట్టిన రోజును పురస్కరించుకొని ‘నమస్తే తెలంగాణ’ ఖమ్మం యూనిట్‌ ఆధ్వర్యంలో 123 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములునాయక్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ భారతదేశంలో అత్యంత అరుదైన రాజకీయ నాయకులలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకరని అన్నారు. ఆయన ఆలోచనలు భావి తెలంగాణకు మార్గదర్శకం అవుతాయని అన్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల గుండెచప్పుడైన జన హృదయ నేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు హరితహారం ద్వారా రాష్ర్టాన్ని పచ్చని వనంలా మార్చాలన్న ఆలోచన కలిగిన సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజున నమస్తే తెలంగాణ ఖమ్మం యూనిట్‌ ఆధ్వర్యంలో కస్తూర్భా పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రకమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. అందులో తాను భాగస్వామి కాయటం ఆనందంగనా ఉందన్నారు.


మార్గదర్శి సీఎం కేసీఆర్‌: తాతా మధు

భావితరాల తలరాతను మార్చే విధాత సీఎం కేసీఆర్‌ అని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతా మధు పేర్కొన్నారు.సంక్షేమ పథకాల అమలులో దేశానికే మార్గదర్శిగా నిలుస్తూ సుస్థిర పాలనతో ప్రజలకు చేరువుగా ఉన్న మహానాయకుడు 66 ఏళ్లు పూర్తి చేసుకొని 67వ వసంతంలోకి అడుగెడుతున్నారని అన్నారు. ఈ సందదర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన కేసీఆర్‌ ఉద్యమాన్ని ఊపిరిగా భావించి తన వాగ్ధాటితో, వ్యూహచాతుర్యంతో అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడని అన్నారు. 


విద్యారంగానికి పెద్దపీట: డీఈవో మదన్‌మోహన్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నదని డీఈవో మదన్‌మోహన్‌ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌కు దీటుగా విద్యాబోధన జరుగుతున్నదన్నారు. 

తెలంగాణకు పచ్చని పండుగ: పొనుగోటి రవీందర్‌, నమస్తే తెలంగాణ బ్యూరో ఇన్‌చార్జ్‌ హరిత తెలంగాణ నిర్మాణ కర్త ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదినం తెలంగాణకు పచ్చని పండుగ వంటిదని నమస్తే తెలంగాణ బ్యూరో ఇన్‌చార్జ్‌ పొనుగోటి రవీందర్‌ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా నమస్తే తెలంగాణ ఖమ్మం యూనిట్‌ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. నాటి ప్రతీ మొక్కనూ సంరిక్షించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.


కేజీబీవీ వేదిక కావటం ఆనందకరం: ప్రత్యేక అధికారి ఝాన్సీసౌజన్య

సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకకు తమ గవిద్యాలయం వేదిక కావటం ఎంతో ఆనందంగా ఉందని కేజీబీవీ ప్రత్యేక అధికారి ఝాన్సీ సౌజన్య పేర్కొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలల్లో అన్ని రకాల వసతులూ కల్పిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇలాంటి పుట్టిన రోజులను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాలకు సంబంధించిన కొన్ని సమస్యలను వేదికపైనున్న ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లగా సాధ్యమైనంత త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే రాములునాయక్‌ హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతా మధు స్పందిస్తూ ప్రధాన సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళుతామన్నారు. 


ఆత్మ వైరా డివిజన్‌ కమిటీ చైర్మన్‌ ముత్యాల సత్యనారాయణ, ఎంపీపీ మాళోత్‌ శకుంతల, జడ్పీటీసీ వాంకుడోత్‌ జగన్‌, వైస్‌ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్‌ దుగ్గినేని శ్రీనివాసరావు, వైస్‌ చైర్మన్‌ దారావత్‌ మంగీలాల్‌, సర్పంచ్‌లు ఆదెర్ల స్రవంతి, అరుణ, నరేశ్‌, బానోత్‌ కుమార్‌, ఎంపీటీసీలు ఇమ్మడి రమాదేవి, జడల వసంత, ఆళోత్‌ ఈశ్వరీనందరాజ్‌, పెద్దబోయిన ఉమాశంకర్‌, పాండ్యానాయక్‌, కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ హనీఫ్‌, ఎంపీడీఓ మాచర్ల రమాదేవి, విద్యాశాఖ అధికారి జెడ్‌.యేసుదాస్‌, డీఆర్వో ఎల్లయ్య, సొసైటీ డైరెక్టర్లు తోటకూరి రాంబాబు, అడ్డగోడ ఐలయ్య, డేగల ఉపేందర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష కార్యదర్శులు తోటకూరి పిచ్చయ్య, అజ్మీర వీరన్న, నాయకులు జడల వెంకటేశ్వర్లు, బత్తుల శ్రీనివాసరావు, నమస్తే తెలంగాణ యాడ్స్‌ మేనేజర్‌ బోయిన శేఖర్‌బాబు, భద్రాద్రి కొత్త గూడెం స్టాఫర్‌ కే.హరీశ్‌రాజు, రిపోర్టర్లు పూనాటి మనోజ్‌కుమార్‌, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, సంపత్‌, మంగపతి, ఇమామ్‌, శివ తదితరులు  పాల్గొన్నారు.


logo