మంగళవారం 07 ఏప్రిల్ 2020
Khammam - Feb 18, 2020 , 00:13:00

రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంతిరుమలాయపాలెం: రైతుల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాత మధు అన్నారు. తిరుమలాయపాలెం సొసైటీలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక సందర్భంగా జరిగిన విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. రైతులను రుణ విముక్తులను చేసి న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో లబ్ధిపొందుతున్న రైతులు సొసైటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారన్నారు. 


తిరుమలాయపాలెం సొసైటీ గత 30 ఏళ్లుగా సీపీఐ(ఎంఎల్‌ న్యూడమోక్రసి) పాలనలో ఉండటం వలన ప్రభుత్వాల ప్రోత్సాహం లేక రైతులకు ఎలాంటి మేలు జరగలేదని పేర్కొన్నారు. తొలిసారిగా తిరుమలాయపాలెం సొసైటీని టీఆర్‌ఎస్‌ పార్టీ గెల్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గెలుపొందిన పాలకవర్గం రైతుల అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. తిరుమలాయపాలెం సొసైటీ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా సహకారం అందించేందుకు తనవంతు కృషిచేస్తానని హామీయిచ్చారు. సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన చావా వేణు, చామకూరి రాజు, డైరెక్టర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు బెల్లం వేణు, మండల పార్టీ అధ్యక్షుడు బాషబోయిన వీరన్న, దొండేటి ఆనందరావు, కొప్పుల వెంకట్రావు, చావా శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


logo