గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Feb 16, 2020 , 23:53:44

నేడు సీఎం కేసీఆర్‌ జన్మదినోత్సవం..

నేడు సీఎం కేసీఆర్‌ జన్మదినోత్సవం..


మయూరి సెంటర్‌ : సామాజిక మాధ్యమాల్లో కేసీఆర్‌ బర్త్‌డే సందర్భంగా ఓ యువకుడు వేసిన చిత్రాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలను తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అనుసంధానం చేసి సోమవారం పెద్ద ఎత్తున్న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఔత్సాహిక చిత్రకారుడు కేసీఆర్‌ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తన చిత్రాల ద్వారా అవగాహన కల్పించేలా చిత్రాలు గీశాడు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టడంతో వైరల్‌గా మారింది.


వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో 

సీఎం కేసీఆర్‌ బర్త్‌డే సందర్భంగా జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. గ్రీన్‌ చాలెంజ్‌ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ అనుబంధ సంఘమైన టీఆర్‌ఎస్‌ కేవీ మెడికల్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ హెచ్‌-1 జిల్లా అధ్యక్షురాలు సూర్యపోగు మేరి నిర్వహించారు.


logo