గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Feb 16, 2020 , 23:44:24

పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలి

పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలి

ఖమ్మం, నమస్తే తెలంగాణ : పల్లెప్రగతి పను లపై ప్రత్యేక దృష్టి సారించి పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అ న్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలితో కలిసి ఎంపీడీవోలు,బ్యాంకర్లు,ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో పల్లెప్రగతి పనులపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మండల పరిధిలో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ప్రతిపనిపై  ఎంపీడీవోలకు సమగ్ర అవగహన కలిగి ఉండాలని కలెక్టర్‌ తెలిపారు. జిల్లా లో 584 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటి వరకు 345 ట్రాక్టర్లు కొనుగోలు చేయటం జరిగిందని ఎంపీడీవోలు తెలిపారు. మిగిలిన  ట్రాక్టర్లు కొనుగోలు ప్రక్రియ ఆలస్యంపై సంబంధిత మండల అభివృద్ధి  అధికారులతో కలెక్టర్‌ మాట్లాడారు. కొనుగో లుకు ఏ విధమైన అడ్డంకులుంటే వెంటనే తన దృష్టికి తీసుకువచ్చి ట్రాక్టర్ల కొనుగోలు ప్రక్రియ రెండు రోజులలో పూర్తి చేయాలని ఆదేశించారు. మైనర్‌ పంచాయతీలకు నిధులు సమకూరని పక్షంలో లోన్‌ ప్రతిపాదికన వెంటనే నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. 


గ్రామ పంచాయతీలకు కొనుగోలు చేసిన ట్రాక్టర్ల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ జరగాలన్నారు. వేర్వేరుగా సేకరించిన తడి, పొడి చెత్తను డంపింగ్‌ యార్డులో నిర్మించిన షెడ్‌లకు తరలించి కంపోస్టు తయారు చేసేందుకు స్వయం సహాయక బృందాలకు వ్యవసాయశాఖ అధికారుల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారిని కలెక్టర్‌ ఆదేశించారు.  బ్యాంకర్లతో సమస్యలుంటే లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌తో పాటు ప్రత్యేకంగా నియమించిన బ్యాంక్‌ అధికారిని సంప్రదించాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహ ణాధికారి ప్రియాంక, జిల్లా రవాణాశాఖ అధికారి క్రిష్ణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి కె. శ్రీనివాస్‌రెడ్డి, లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌రావు, ఎస్‌బీఐ సీఎం క్రెడిట్‌ అధికారి సునిత, లోన్‌ ప్రాసెసింగ్‌ అధికారి హేమంత్‌, అన్ని బ్యాంక్‌ల బాధ్యులు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.


logo