సోమవారం 30 మార్చి 2020
Khammam - Feb 15, 2020 , 23:08:28

బంజారాల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

బంజారాల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయం
  • వైరాలో సేవాలాల్‌ మహరాజ్‌కు నివాళులర్పించిన మంత్రి

ఖమ్మం రూరల్‌, నమస్తేతెలంగాణ, ఫిబ్రవరి 15: ఏదులాపురం సొసైటీ ఎన్నికల్లో ఎట్టకేలకు అందరి ఊహించనట్టు సొసైటీ పీఠాన్ని టీఆర్‌ఎస్‌-సీపీఎంల కూటమి కైవసం చేసుకుంది. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌-సీపీఎం కలిసి పోటీ చేయగా, సీపీఐ-కాంగ్రెస్‌ కలిసి పోటిలో నిలిచాయి. ఫలితాల్లో సీపీఐ-కాంగ్రెస్‌ కూటమికి ఊహించని దెబ్బ తగిలింది. 1వ వార్డులో టీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన సీపీఎం అభ్యర్థి వురిడి హైమావతి తన సమీప సీపీఐ అభ్యర్థిపై 39 ఓట్ల మోజార్టీతో గెలిచింది. 2వ వార్డులో సీపీఐ అభ్యర్థి మహ్మద్‌ మౌలానా తన సమీప టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై  10ఓట్లతో గెలిచాడు. 3వ వార్డులో  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గుండు శ్రీనివాస్‌ తన సమీప అభ్యర్థి తేజావత్‌ శ్రీనుపై మండలంలోని టాప్‌ మోజార్టీ 250 ఓట్లతో వార్డును కైవసం చేసుకున్నాడు. 4వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి యండపల్లి రవి తన సమీప అభ్యర్థి కొప్పుల కిషన్‌రావుపై 40 ఓట్లతో గెలిచాడు. 5వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి యేనుగు ధర్మారెడ్డి తన సమీప అభ్యర్థిపై 4 ఓట్లతో గెలిచాడు. 6వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి మెదరమెట్ల శ్రీనివాసరావు ఎకగ్రీవంగా గెలిచాడు. 


7వవార్డు సీపీఎం అభ్యర్థి తాటికొండ శ్రీనివాసరావు తన ప్రత్యర్థి ఆళ్ల రమేష్‌పై 53 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. 8వార్డు ఎకగ్రీవంగా టీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. 9వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రెంటాల నీరజ తన ప్రత్యర్థిపై అంతోటి మాణిక్యమ్మ 96 ఓట్ల తేడాతో తిరుగులేన విజయం సాధించడంతో ఇక్కడ కాంగ్రెస్‌ చితకలబడింది. 10వ వార్డులో మట్టా వీరభద్రం టీఆర్‌ఎస్‌కు ఎకగ్రీవం అయింది. 11వ వార్డులో సీపీఎం అభ్యర్థి తుమ్మల శ్రీనివాసరావుపై సీపీఐ అభ్యర్థి పీ చందరావు 68 ఓట్లతో విజయం సాధించాడు. 12వార్డులో ఎవరు ఊహించిన విధంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అల్లిక వెంకటేశ్వరరావు సీపీఐకు గట్టిపోటి ఇచ్చి బండి రమణపై 50 ఓట్లతో తిరుగులేని విజయం సాధించారు. 13వ వార్డులో సైతం టీఆర్‌ఎస్‌ను హవాను కొనసాగించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జర్పుల లక్ష్మన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి బాణోత్‌ పాపా పై 8 ఓట్ల మోజార్టీతో విజయం సాధించడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్యానెల్‌ ఏదులాపురం సొసైటీ పీఠాన్ని దక్కించుకుంది. 


చతికిలబడిన కాంగ్రెస్‌-సీపీఐ పార్టీలు..

వరుసగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓటమితో పాటు సహకార ఎన్నికల్లో కూడా ఇరు పార్టీలు ప్రభావం చూపలేకపోవడంతో వాకి ఓటు బ్యాంకు తీవ్రంగా తగ్గింది. ఒక్క మౌలానా మాత్రమే స్వల్ప మోజార్టీతో గెలిచాడు. రూరల్‌ మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్‌ 30 సంవత్సరాలకు అనుభవంతో మండల రాజకీయాల్లో చక్రం తిప్పుతండటంతో వరుస విజయాలు దక్కుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి సహకారంతో విజయం సాధ్యమైందని పార్టీ నాయకులు టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు గ్రామాల్లో సంబురాలు జరుపుకుంటున్నారు. 


గూడురుపాడులో చరిత్రాత్మక గెలుపు..

మండలంలోని గూడురుపాడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అల్లిక వెంకటేశ్వరరావు బలంగా ఉన్న సీపీఐ-కాంగ్రెస్‌లపై గెలిచి చరిత్ర సృష్టించాడు. అనతికాలంలోనే సీపీఐ గడ్డగా పేరున్న గూడురుపాడు చరిత్రను తిరగరాశారు. 


ఇక చైర్మన్‌ ఎన్నిక అనివార్యమే..

సొసైటీ చైర్మన్‌కు టీఆర్‌ఎస్‌-సీపీఎం కూటమిలకు పూర్తి మోజార్టీ రావడంతో చైర్మన్‌ ఎన్నిక ఎకగ్రీవం కానుంది. పొత్తులో భాగంగా చైర్మన్‌ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ ఇవ్వాలని, వైస్‌ చైర్మన్‌ సీపీఎంకు ఇవ్వాలని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నాయి. దీంతో కూటమి ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. చైర్మన్‌ అభ్యర్థి మాత్రం మద్దివారిగూడెం గ్రామానికి చెందిన సీనియర్‌ నాయకుడు యేనుగు ధర్మారెడ్డి పేరు వినిపిస్తుండగా దానిని ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.  సహకార ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మండలపార్టీ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బెల్లం వేణు తెలిపారు.


logo