గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Feb 14, 2020 , 23:02:51

‘పాలెం’ విద్యార్థినికి గోల్డ్‌మెడల్‌ అందించిన గవర్నర్‌

‘పాలెం’ విద్యార్థినికి గోల్డ్‌మెడల్‌ అందించిన గవర్నర్‌

రఘునాథపాలెం, ఫిబ్రవరి14: మండలంలోని మంచుకొండ గ్రామానికి చెందిన పెనుకూరి మమతకు శుక్రవారం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ గోల్డ్‌ మెడల్‌ ప్రధానం చేశారు. కాకతీయ యూనివర్శిటీలో ఎంఈడీ చదువుతున్న మమత ఉత్తమ ప్రతిభను చాటుకుంది. దీంతో హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్‌ ఆమెను గోల్డ్‌మెడల్‌తో సత్కరించారు. మమత తండ్రి వెంకటేశ్వర్లు ఆర్టీసీ కండక్టర్‌గా, తల్లి విమల అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్నారు. చిన్ననాటి నుంచి చదువులో ముందంజలో ఉండటంతో మమతకు ఈ అరుదైన గౌరవం లభించిందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామస్థులు సైతం మమతను అభినందించారు. 


logo
>>>>>>