శనివారం 04 ఏప్రిల్ 2020
Khammam - Feb 13, 2020 , 23:34:12

సహకార ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

సహకార ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

కూసుమంచి: గత పాలకుల నిర్లక్ష్యంతో నిర్వీర్యమైన సహకార రంగం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తరువాత బలోపేతమై అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా సహకార రంగాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకపోయిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుంది. అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ, రుణాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటూ సంఘాలు నా డు మూత పడే పరిస్థితిలో ఉండేవి.. మరి నేడు వాణిజ్య బ్యాంక్‌లతో పోటీ పడుతూ లక్షలాది మందికి రుణాలు అందించి రైతు కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయి..  

 గత పాలకుల నిర్లక్ష్యంతో నిర్విర్యమైన సహకార రంగం టీఆ ర్‌ఎస్‌ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తరువాత తీసుకున్న నిర్ణయాలు బలోపేతమై అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచింది. దేశంలో ఎక్కడా లేని విధంగా సహకార రంగాన్ని  అన్నీ రంగా ల్లో  ముందుకు తీసుకపోయిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కుతుంది. సహకార రంగం మళ్లీ జవసత్వాలు పుంజు కోవ టానికి సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన సంస్కరణలే అందుకు  ప్రత్యక్ష సాక్ష్యంగా  నిలిచాయి.రైతన్నలకు అండగా నిలిచే సహ కార రంగాలు పూర్తిగా దీనావస్థకు చేరుకొగా వాటిని పూర్తి స్థాయి లో నిధులు సమకూర్చి, లాభాల బాటవైపునకు పయనం అయ్యేలా చేయటంతో నేడు సం ఘాలు పూర్తి స్థాయిలో నిలదొక్కొగ లిగాయి.రైతును అన్నీ రంగాల్లో ఆదుకో వాలనే సంకల్పతో సహకార రంగంలో సమూల మార్పులు తెచ్చి రైతుల కు అండగా నిలిచింది టీఆర్‌ఎస్‌ సర్కార్‌. భవిష్యత్తుపై భరోసానిచ్చి  సహకారాన్ని గుభాళించిన టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు అన్నదాతలు జేజేలే పలుకుతున్నారు.

ప్రతి రైతుకూ రుణ సదుపాయం..  

గతంలో సహకార సం ఘాల్లో పరపతి ఉన్న వారికి, రాజకీయ నాయకులకు రుణాలు అం దేవి.. కానీ నేడు ప్రతీ రైతుకు తక్కువ వడ్డీకే రుణం అందుతోంది.. 2014 తరువాత టీఆర్‌ఎస్‌ సర్కారు తీ సుకున్న నిర్ణయాలతో సహకార రంగంలో సమూల మార్పులు వచ్చాయి. రైతులకు క్రాప్‌ లోన్‌ కింద పావలా వడ్డీతో రుణాలు అందిస్తున్నారు. జిల్లాలోని 99 సంఘాల ద్వారా లక్షలాది మంది రైతులకు రూ. 2వేల కోట్ల రుణాలు అందించారు. గతంలో కేవలం రూ. 800కోట్లు రుణా లు అందించగా, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక రుణాల విషయం లో 250శాతం పెరిగి.. నేడు స న్నా, చిన్నకారు రైతుల దగ్గరినుంచి ప్రతీ ఒక్క రైతుకు రుణాలు అందితుతున్నాయి. 

వాణిజ్య బ్యాంకులతో  పోటాపోటీగా..

 వాణిజ్య బ్యాంకులతో సమానంగా సహకార బ్యాంక్‌లు నేడు అన్నిరంగాల్లో ముందుకు పోతున్నాయి. గతంలో జిల్లాలో 30 వరకు బ్యాం క్‌లు ఉండగా,  వాటిని మరో 20 పెంచి ప్రస్తుతం 50 బ్రాంచ్‌లుగా చే శారు. బ్యాంకు ల్లో రైతులకు లాకర్‌ సౌకర్యంతో పాటు, బంగారు ఆభరణాలపై 11 శాతం వడ్డీ తో రుణా లు ఇస్తున్నారు. మి గిలిన బ్యాంక్‌లు పహానీ నకళ్లు పెట్టు కొని రుణాలు ఇ స్తుండగా..సహకారం సంఘా ల్లో ఎలాంటి పత్రాలు లేకుం డా రుణాలు ఇస్తున్నారు.  

ఆర్థిక బలోపేతానికి డెయిరీ ఫాం, టూవీలర్లు.. 

సహకార రంగంలోని రైతులకు వ్యవసాయానికి అనుసంధానంగా ఉన్న చిరువ్యాపారాలు చేసుకునేందుకు మోపెడ్‌లు, టూవీలర్‌లు అందజేశారు. రైతులకు వ్యవసాయానికి తోడుగా పాడి గేదెలను అందేజేసే విధంగా డెయిరీ ఫాంలను అందించారు. వీటితో రైతులకు వ్యవసాయంతోపాటు అదనపు ఆదాయం లభిస్తుంది.. 

ఆన్‌లైన్‌ ద్వారా కార్యకలాపాలు..

గతంలో మ్యానువల్‌గా ఉన్న సహకార సంఘాల్లో నేడు ప్రతీదీ ఆన్‌లైన్‌ పద్ధతిలో అవినీతి రహితంగా, పారదర్శకంగా లావాదేవీలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని అన్ని సంఘాల్లో ఆన్‌లైన్‌ విధానం అమలులో ఉంది. రైతుల సభ్యత్వాలు, రుణాలు, రెన్యువల్స్‌, కొత్త రుణాలు, ఇరత రుణాలు అన్నీ సహకారరంగంలో ఆన్‌లైన్‌ విధానంలోనే జరుగుతున్నాయి. అవకతవకలకు తావు లేకుండా లావాదేవీలు నేరు గా రైతులకు తెలిసే విధంగా ఎస్‌ఎంస్‌ల ద్వా రా ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు.  

ఖాతాదారులకు ఏటీఎం కార్డులు..

సహకార సంఘాల్లో ఖాతాలు ఉన్న రైతులకు ఇరత బ్యాంకు ఏటీఎంల్లో డబ్బులు తీసుకునే విధంగా ఏటీఎం కార్డులు అందజేశారు. అయితే జిల్లా సహకార బ్యాంక్‌కు ప్రత్యేకంగ జిల్లాలో ఏటీఎంలు ఏర్పాటు చేశారు. అందులో నగదు ఎప్పుడూ ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  

ధాన్యం కొనుగోలు కేంద్రాలు.. 

జిల్లాలో సహకార రంగం ద్వారా 60కిపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. లక్ష్యానికి మించి ధాన్యం సేకరణ చేశారు. రైతులకు డబ్బులు వెంటనే అందటంతో కోఆపరేటివ్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మంచి ఆదరణ లభించింది.  

మరణించిన రైతు కుటుంబానికి అండ.. 

సహకార సంఘంలో సభ్యుడై ఉం డి, అకాల మరణం చెందిన రైతు కుటుంబానికి రూ. 50వేలు ఆర్థిక స హాయాన్ని అందిస్తున్నారు.దివాళా దిశగా ఉన్న సంఘాలను స్వయం సమృద్ధితో మళ్లీ రైతులకు అందుబాటులోకి తేవటంతోపాటు ఎరువులు, విత్తనాల వంటి వాటిని సహకార సం ఘాల ద్వారా అందించారు.  


logo