శనివారం 28 మార్చి 2020
Khammam - Feb 13, 2020 , 23:34:12

అభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

అభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

మధిర, నమస్తేతెలంగాణ, ఫిబ్రవరి13 : అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని, కేసీఆర్‌ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పలువురు ఆకర్శితులై టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారని జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. గురువారం మధిర పట్టణంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వంకాలపాటి నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆయనకు టీఆర్‌ఎస్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జడ్పీచైర్మన్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, మిషన్‌ భగీరథ, మిషన్‌కాకతీయ, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, కేసీఆర్‌ కిట్‌, రైతుబంధు, రైతుబీమా, తదితర అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి రాజకీయాలకు అతీతంగా క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతిఒక్కరికీ అందజేస్తూ ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నారని తెలిపారు. పార్టీలో చేరిన వారందరికీ టీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని, పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ శక్తివంచన లేకుండా కృషిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవిశెట్టి రంగారావు, మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, కార్యదర్శి చిత్తారు నాగేశ్వరరావు, నాయకులు కరివేద వెంకటేశ్వరరావు, బిక్కి కృష్ణప్రసాద్‌, కనుమూరి వెంకటేశ్వరరావు, డోకుపర్తి సత్యంబాబు, కొఠారి రాఘవరావు, భువనగిరి నారాయణరావు, బీ.వీ.ఆర్‌., చుంచు విజయ్‌, కరివేద సుధాకర్‌, కపిలవాయి జగన్మోహన్‌రావు, ఎస్‌.కే.ఖాదర్‌, కోమటిడి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. 


logo