ఆదివారం 29 మార్చి 2020
Khammam - Feb 13, 2020 , 22:34:32

ఎంపీడీవోల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

ఎంపీడీవోల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

మామిళ్లగూడెం, ఫిబ్రవరి 13 : తెలంగాణ మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి, ఖమ్మం జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవో వివి అప్పారావు తెలిపారు. సంఘం రాష్ట్ర కమిటీ నియమ నిబంధనల మేరకు జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించామని తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించామని తెలిపారు. ఉదయం సంఘంలో వివిధ స్థాయిలో కమిటిలో పని చేసేందకు ఆసక్తి ఉన్న ఎంపీడీవోల నుంచి నామినేషన్లు స్వీకరించామన్నారు. అనంతరం ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్లు పరిశీలించి ఎన్నికైన వారి పేర్లు ప్రకటించామన్నారు. ప్రతి పోస్టుకు ఒక్కరే అభ్యర్థి నామినేషన్‌ దాఖాలు చేయడంతో జిల్లా కమిటీ మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించినట్లు వివరించారు. ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా నేలకొండపల్లి ఎంపీడీవో బి.రవికుమార్‌, ప్రధాన కార్యదర్శిగా ఖమ్మం రూరల్‌ ఎంపీడీవో బి.శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా పెనుబల్లి ఎంపీడీవో మహాలక్ష్మీ, కల్లూరు ఎంపీడీవో టి.శ్రీనివాసరావులు ఎన్నికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎంపీడీవోల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కమిటీకి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా కమిటీ అధ్యక్షులు మల్లెల రవీంద్రప్రసాద్‌ అభినందనలు తెలిపారు. ఎన్నికల కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల ఎంపీడీవోలు కరుణాకర్‌రెడ్డి, అశోక్‌చరణ్‌, జయరాం, రేవతి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 


logo