మంగళవారం 31 మార్చి 2020
Khammam - Feb 13, 2020 , 01:12:37

పట్టణ ప్రగతికి సిద్ధం కావాలి..

పట్టణ ప్రగతికి సిద్ధం కావాలి..

ఖమ్మం నమస్తేతెలంగాణ: పట్టణ ప్రగతి యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ మున్సిపల్‌ కమిషనర్‌లను ఆదేశించారు. బుధవారం సాయంత్ర కలెక్టరేట్‌ ప్రజ్ఞా సమావేశ మందిరంలో మున్సిపల్‌ కమిషనర్‌లతో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి సన్నాహక సమావేశంలో కలెక్టర్‌ మున్సిపల్‌ కమిషనర్‌లకు పలు ఆదేశాలు చేశారు. ఖమ్మం నగర పాలక సంస్థతో పాటు వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపల్‌ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టేందుకు గాను ముందస్తుగానే డంపింగ్‌ యార్డులు, స్మశానవాటికలు, వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్లు కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని మున్సిపల్‌ కమిషనర్లను కలెక్టర్‌ ఆదేశించారు. అధేవిధంగా హరితహారం కింద పటణం, నగరాలను సుందరీకరించేందుకు పార్కులను, ట్యాంకుబండ్‌లను గుర్తించాలని, విద్యుత్‌ సమస్యలకు సంబంధించిన పనులను చేపట్టేందుకు విద్యుత్‌ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సూచించారు. దీనితో పాటు మున్సిపాలిటీలలో పారిశుధ్య పనులు చేపట్టేందుకు కావాల్సిన స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లు, డోజర్స్‌ సమకూర్చుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ తెలిపారు. దీనితో పాటు ఆయా మున్సిపాలిటీలలో ఖాళీ పోస్టుల వివరాలు, వార్డు కమిటీల వివరాలను సమర్పించాలని ప్రతి వార్డుకు స్పెషల ఆఫీసర్‌ను నియమించేందుకు ప్రతిపాదించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అటవీశాఖ అధికారుల సమన్వయంతో గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేయాలని అన్నారు. ప్రధాన కూడళ్లలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ ఏర్పాటుకు గాను ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని, రోడ్డుకు ఇరువైపుల ఉన్న వ్యాపారులందరికీ ఒకే చోట స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని, మున్సిపల్‌ పరిధిలో జరిగే నూతన భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులకు నూతన మున్సిపల్‌ యాక్టు గురించి ప్రజలకు వివిధ ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలని మున్సిపల్‌ కమిషనర్లను కలెక్టర్‌ ఆదేశించారు. మున్సిపల్‌ కమిషనర్లందరూ నూతన యాక్టును సమగ్రంగా అవగాహన చేసుకొని తదనుగుణంగా యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేయాలని కలెక్టర్‌ తెలిపారు. ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, శిక్షణ కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, అడిషనల్‌ కలెక్టర్‌ ఎన్‌ మధుసూధన్‌, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రవీణ, వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపల్‌ కమిషనర్లు విజయానంద్‌, మీనన్‌, దేవేందర్‌ తదితరులు సమావేశంలో సాల్గొన్నారు.logo
>>>>>>