ఆదివారం 29 మార్చి 2020
Khammam - Feb 13, 2020 , 01:11:43

చదువు విజయతీరాలకు చేరుస్తుంది

చదువు విజయతీరాలకు చేరుస్తుంది

కూసుమంచి: విద్య ఉన్నత శిఖరాలను అందుకునేలా చేస్తుంది  ప్రతీ విద్యార్థి చదువులో రాణించి భావిభారత పౌరులుగా వెలుగొందాలని పాలేరు శాసన సభ్యులు కందాల ఉపేందర్‌రెడ్డి అన్నారు. కూసుమంచి హైస్కూల్లో హైదరాబాద్‌ బుక్‌ ఫేయిర్‌ అసొసియేషన్‌ అధ్యక్షుడు జులూరు గౌరీశంకర్‌ ఆధ్వర్యంలో చేపట్టిన బుక్‌ ఫేయిర్‌ను ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యకు ప్రాధాన్యతను ఇచ్చిందన్నారు. విద్యకు నిధుల కేటాయింపులు ఎక్కువగా వచ్చాయని తెలిపారు. సీఎం కేసీఆర్‌ విద్యపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారని తెలిపారు. పాఠశాలలకు కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాటులో ముందుంటానని పేర్కొన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్లేట్ల విషయంలో వచ్చే విద్యా సంవత్సరానికి అందరికీ ఇచ్చేలా విద్యాశాఖ అధికారులు ముందే వివరాలు అందిస్తే సహకరిస్తానని తెలిపారు. పేద విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారని ఉపాధ్యాయులు శ్రద్ధ చూపాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఐఐటీ, ఐఐఐటీ, మెడిసిన్‌ వంటి వాటిల్లో సీట్లు సంపాదించుకున్న విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తానన్నారు.

ఎమ్మెల్యే కందాల స్ఫూర్తి అనిర్వచనీయం: జూలూరు గౌరీశంకర్‌..

    తాము బుక్‌ ఫేర్‌ ఏర్పాటు చేస్తామని చెప్పగానే నియోజకవర్గంలోని అన్నీ పాఠశాలలకు అయ్యే ఖర్చు రూ.4 లక్షలు సొతంగా ఇస్తానని చెప్పిన ఎమ్మెల్యే కందాల ఇచ్చిన ప్రోత్సాహం నేడు రాష్ట్రంలో 1000 పుస్తక ప్రదర్శనలకు కారణం అయిందని హైదరాబాద్‌ బుక్‌ ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, బీసీ కమిషన్‌ చైర్మన్‌ జులూరి గౌరీశంకర్‌ అన్నారు.  ఫేర్‌కు ఇంత మంచి ఆదరణ లభించిందంటే అందుకు ప్రత్యేకంగా తనకు ప్రోత్సాహాన్ని అందించిన ఎమ్మెల్యే కందాళకు కృతజ్ఞతలు తెలిపారు. 2020 పుస్తక ప్రదర్శనలు చేయాలనే సంకల్పం నిరవేరుతుందని అన్నీ మారుమూల ప్రాంతాలకు దీనిని తీసుకుని పోతామన్నారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య: డీఈవో...

   ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందిస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి మదన్‌మోహన్‌ అన్నారు. సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పాలేరు నియోజకవర్గంలోని అందరూ 10వ తరగతి విద్యార్థులకు సాయిత్రం స్నాక్స్‌ కోసం రూ.11.5 లక్షలు ఎమ్మెల్యే కందాళ స్వయంగా ఇవ్వటం సంతోషించాల్సిన విషయన్నారు. మంచి విద్యను అందివ్వటం కోసం అంతా సమష్టిగా పనిచేస్తామని తెలిపారు. సమావేశంలో  ఎంపీపీ బాణోత్‌ శ్రీనివాస్‌, ఎంపీటీసీ మాదాసు ఉపేందర్‌రావు, నేలకొండపల్లి ఎంఈవో పురుషోత్తం హెచ్‌ఎంలు భూ లక్ష్మి, ప్రమీల, నర్సింహమూర్తి పాల్గొన్నారు.

పుస్తక ప్రదర్శనను తిలకించిన ఎమ్మెల్యే...

నాయకన్‌గూడెం, జీళ్లచెర్వు, కూసుమంచి పాఠశాలలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శను ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి తిలకించారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ బుక్‌ ఫేర్‌ అధ్యక్షుడు జులూరు గౌరీ శంకర్‌, ఎంపీపీ బాణోత్‌ శ్రీనివాస్‌, ఉపాధ్యాయులున్నారు.


logo