గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Feb 13, 2020 , 01:03:56

సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక కల్యాణలక్ష్మి

సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక కల్యాణలక్ష్మి

తల్లాడ: కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు సీఎం కేసీఆర్‌కు మానస పుత్రికలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో 30 మందికి రూ.29,78,480 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన యువతుల వివాహానికి ఈ పథకం వరంలాంటిదన్నారు. ఈ పథకాన్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతాంగానికి సంబంధించి రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు.  ఏఈవోలను 2,500 ఎకరాల చొప్పున కేటాయించి రైతులందరికీ సత్వరమే న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. రైతులకు ప్రవేశపెడుతున్న పథకాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలన్నారు. రైతుల పంటలకు మద్దతు ధర కల్పించి గ్రామాల్లో సహకార సంఘాలు, ఐకేపీల ద్వారా రైతులు దళారులను ఆశ్రయించకుండా మద్దతు ధర కల్పించి ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. సొసైటీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నామని, సహకార సంఘ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించి అన్ని సంఘాలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ గంటా శ్రీలత, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, సర్పంచ్‌లు అయిలూరి లక్ష్మి, నారపోగు వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ కటికి భారతమ్మ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దుగ్గిదేవర వెంకట్‌లాల్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ దూపాటి భద్రరాజు, ఆర్‌ఐలు ఖాజామైనుద్దీన్‌, నాగలక్ష్మి పాల్గొన్నారు.


logo