శుక్రవారం 10 జూలై 2020
Khammam - Feb 11, 2020 , 23:27:25

చక్రం తిప్పారు

చక్రం తిప్పారు

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నేతృత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు పరుగులు పెడుతుంది. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం అతిక్లిష్టమైన ఆర్టీసీ సమ్మెను పరిష్కరించడంలో విజయం సాధించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఉమ్మడి జిల్లాలో ఒక వైపు అభివృద్ధి పనులు, మరోవైపు పార్టీ పటిష్టతపై దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా పనిచేస్తున్న తాతా మధు, నూకల నరేష్‌రెడ్డిలను సమన్వయం చేసుకుంటూ ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తూ గులాబీ జెండాను రెపరెపలాడిస్తున్నారు. వీరి సమన్వయంలోనే ఇటీవల జరిగిన ఉమ్మడి జిల్లాలోని మున్సిపల్‌ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. ఉమ్మడి జిల్లాలో ఐదు  మున్సిపాలిటీలకు గాను ఐదు మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఎప్పటికప్పుడు మంత్రి అజయ్‌కుమార్‌ సూచనలు, సలహాలు స్వీకరిస్తూ స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు పన్నుతూ ప్రతిపక్షాలను చిత్తుచేస్తూ మొత్తం నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల అనంతరం వచ్చిన సహకార సంఘాల ఎన్నికల్లో పార్టీ దూసుకుపోవడానికి వీరు ప్రధానభూమిక పోషించారు. పార్టీ నిర్థేశించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు అమలు చేస్తూ పార్టీ విజయానికి శ్రమించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 36 సహకార సంఘాల చైర్మన్లు ఏకగ్రీవం కావడంలో కీలక పాత్ర పోషించారు. సహకార ఎన్నికల్లో నిత్యం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ రాష్ట్ర పార్టీ నేతలు తాతా మధు, నూకల నరేష్‌రెడ్డికి సూచనలు, సలహాలిస్తూ పార్టీ కేడర్‌ను సమన్వయం చేస్తూ సంఘాలు ఏకగ్రీవం కావడంలో కీలకపాత్ర పోషించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 101 సహకార సంఘాలు ఉండగా అందులో ఖమ్మం జిల్లాలో 76 సంఘాలు ఉన్నాయి. అందులో 34 సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 42 సొసైటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మొత్తం 21 సొసైటీలకు గాను 20 సొసైటీలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. భద్రాచలం సొసైటీలో కేవలం 40 మంది సభ్యులుండటంతో ఈ నెల 15వ తేదీన చేతులెత్తే పద్దతి ద్వారా చైర్మన్‌, వార్డు సభ్యులను ఎన్నుకోనున్నారు. అశ్వాపురం, నెల్లిపాక సొసైటీలు ఏకగ్రీవండంతో మిగతా 18 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 

ఖమ్మం జిల్లాలో ఏకగ్రీవమైన సొసైటీలు...

జిల్లా వ్యాప్తంగా మొత్తం 76 సొసైటీలుండగా వీటిలో 34 సొసైటీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 42 సొసైటీల్లో మరో 183 వార్డులు ఏకగ్రీవం కాగా 363 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ స్థానాల కోసం మొత్తం 784 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఏకగ్రీవమైన సొసైటీలు వీవీ పాలెం, మంచుకొండ, రఘునాథపాలెం, పైనంపల్లి, బోదులబండ, రాజారామ్‌పేట, మండ్రాజుపల్లి, చెన్నారం, మోటాపురం, జక్కేపల్లి, మేడేపల్లి, వైరా, బోనకల్‌, ముష్టికుంట్ల, పెద్దబీరవల్లి, నారాయణపురం, బ్రహ్మణపల్లి, ఖమ్మంపాడు, పెద్దగోపారం, రాజపాలెం, మీనవోలు, ఎర్రుపాలెం, తక్కెళ్లపాడు, చిన్నకోరుకొండి, పోచారం, సత్తుపల్లి, భరణిపాడు, కందుకూరు, పల్లేవాడ, పెనుబల్లి, గోపవరం, కొర్లగూడెం, కిష్టారం, వేంసూరులు ఉన్నాయి.  


logo