శనివారం 28 మార్చి 2020
Khammam - Feb 11, 2020 , 23:23:16

ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలు తగ్గించాలి

ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలు తగ్గించాలి

వరంగల్‌ సబర్బన్‌, నమస్తే తెలంగాణ : సంస్థలో పని చేసే అన్నిస్థాయిల సిబ్బంది కృషితోనే మేడారం జాతరలో నిరంతరంగ విద్యుత్‌ సరఫరా చేయడం వీలైందని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ అన్నమనేని గోపాల్‌ రావు ప్రశంసించారు. ఆదే స్ఫూర్తిని మున్ముందు కూడా కొనసాగించాలని పిలుపునిచ్చారు. సోమవారం నక్కల గుట్టలోని విద్యుత్‌ భవన్‌లో మహబూబాబాద్‌, భూపాలపల్లి, వరంగల్‌ రూరల్‌, అర్బన్‌, జనగాం, ఖమ్మం, కొత్తగూడెం సర్కిళ్ల ఎస్‌ఈలు,డీఈ, ఏడీఈ, ఏఈలతో పాటు అన్ని స్థాయిల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగ సీఎండీ మాట్లాడుతూ  బకాయి పడిన బిల్లులను కూడా వెంటనే వసూలు చేయాలని అన్నారు. సంస్థ పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలను పూర్తి స్థాయిలో తగ్గించాలని చెప్పారు.డిపార్ట్‌మెంటు వాహనాల్లోనే ట్రాన్స్‌ఫార్మర్లను రవాణా చేయాలని ఆదేశించారు. 33కేవి, 11కేవి విద్యుత్‌ లైన్లను ఎప్పటికప్పుడు తకిఖీ చేయాలని సూచించారు. విద్యుత్‌ అంతరాయాలను తగ్గించాలంటే లైన్‌ పె ట్రోలింగ్‌ తప్పని సరని అభిప్రాయాపడ్డారు.ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద పని చేసే సిబ్బంది తప్పనిసరిగా భద్రత పరమైన చర్యలను తీసుకునేలా చూడాలన్నారు. ప్రతీ సూరింట్‌డెంట్‌ ఇంజనీర్‌  కింది స్థాయి సిబ్బందితో తరచుగా సమీక్షలు నిర్వహిం చాలని అన్నారు. పెండింగ్‌ వర్క్‌ ఆర్డర్లను వెంటనే మంజూరు చేయాలన్నారు. మేడారం జాతరలో ఒక్కనిమిషం పాటు కూడ విద్యుత్‌ అంతరాయం లేకుండ సరఫరా చేసినందుకు భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ కర్ణన్‌ అందించిన మెడల్‌, షీల్డును ఎస్‌ఈ నరేష్‌ సీఎండీకి అందించారు. ఈ సమావేశంలో కంపెనీ డైరక్టర్లు నర్సింగా రావు, సంధ్యా రాణి, మోహన్‌ రెడ్డి, గణపతి, సీజీఎంలు తిరుపతి రెడ్డి, అశోక్‌, తిరుమల్‌ రావు, మధూసూదన్‌, కిషన్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనివాస్‌, జీఎంలు సత్యనారాయణ, వెంకట కృష్ణ, వెంకటరమణ, వేణుబాబు, ఎస్‌ఈలు రాజు చౌహాన్‌, కేఎన్‌ గుట్ట, మల్లికార్జున్‌, నరేష్‌, రమేశ్‌, సురేందర్‌, నాగప్రసాద్‌, రవిందర్‌, కంపెనీ సెక్రెటరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.



logo