మంగళవారం 31 మార్చి 2020
Khammam - Feb 10, 2020 , 23:52:12

స్వచ్ఛ ఖమ్మంలో భాగస్వాములు కావాలి..

స్వచ్ఛ ఖమ్మంలో భాగస్వాములు కావాలి..

మామిళ్లగూడెం: ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువులతో జీవితంలో రాణించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సతీమణి వసంతలక్ష్మి అన్నారు. సోమవారం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, వసంతలక్ష్మి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ క్యాంపులో ఉన్న గిరిజన సంక్షేమ కళాశాల విద్యార్థుల వసతి గృహంలో విద్యార్థులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. వసతిగృహానికి వచ్చిన వసంతలక్ష్మికి వసతిగృహ సంక్షేమాధికారి రూపాదేవి, విద్యార్థులు పుష్పగుచ్ఛాలతో ఘనస్వాగతం పలికారు. ముందుగా విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఉన్నత చదువులకు కష్టాలను జయిస్తే మంచి భవిష్యత్తులో విజయాలను సాధించవచ్చు అన్నారు. ఈ సందర్భంగా వసతిగృహంలో విద్యార్థులతో కలిసి కలియదిరిగారు. విద్యార్థులతో కలిసి సెల్ఫీ దిగారు. అందుతున్న సౌకర్యాలు, ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. వసతిగృహంలో ఉన్న సమస్యల పరిష్కారానికి మంత్రితో మాట్లాడి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల కిలిమంజారో పర్వతాన్ని ఎక్కిన గిరిజన గురుకుల విద్యార్థిని వెన్నెలను అభినందించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు బాజీబాబా, టీఆర్‌ఎస్‌ యవజన విభాగం నాయకులు రడం సురేశ్‌, కార్పొరేటర్లు దోరెపల్లి శ్వేత, కుమ్మరి ఇందిర, కొత్తపల్లి నీరజ, ఊటుకూరి లక్ష్మీసుజాత, టీఆర్‌ఎస్‌ నాయకులు కందగట్ల రాజేందర్‌, ఇల్లెందు టీఆర్‌ఎస్‌వీ నాయకులు నవీన్‌, పాల్గొన్నారు.

హరితహారంలో పువ్వాడ దంపతులు..

ఖమ్మం, నమస్తే తెలంగాణ: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పెండ్లి రోజు సందర్భంగా నగరంలోని కార్పొరేటర్‌ చావా నారాయణరావు ఆధ్వర్యంలో 22వ డివిజన్‌ కవిరాజ్‌ నగర్‌లో సోమవారం హరితహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌-వసంతలక్ష్మి దంపతులు హాజరై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ పాపాలాల్‌, కార్పొరేటర్‌ దొరేపల్లి శ్వేత, ప్రశాంత లక్ష్మి, కర్నాటి కృష్ణ, నాయకులు పద్మాజారెడ్డి, జ్వోతిర్మయి, నాగేశ్వరరావు, వీరేందర్‌, రవి, యాకూబ్‌పాషా తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>