గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Feb 10, 2020 , 23:51:16

పెనుబల్లి సొసైటీ చైర్మన్‌గా మువ్వా హ్యాట్రిక్‌

పెనుబల్లి సొసైటీ చైర్మన్‌గా మువ్వా హ్యాట్రిక్‌

పెనుబల్లి: పెనుబల్లి సొసైటీ పాలకవర్గం రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికైంది. సొసైటీ చైర్మన్‌గా డీసీసీబీ మాజీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు మూడోసారి ఎన్నికై హ్యాట్రిక్‌ సాధించారు. సొసైటీ పరిధిలో 13 టీసీలకు గాను 61 మంది నామినేషన్లు దాఖలు చేయగా, వాటిలో 13 టీసీలు ఏకగ్రీవమయ్యాయి. ముచ్చటగా మూడోసారి 7వ వార్డు లంకపల్లి నుంచి మువ్వా విజయ్‌బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నుకోబడటం వరుసగా మువ్వాకు ఇది రెండో సారి. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు కనగాల వెంకటరావు ఆధ్వర్యంలో నాయకులు మువ్వాకు మిఠాయిలు తినిపించి అభినందనలు తెలియజేశారు. వీయం బంజరు రింగుసెంటర్‌లో పటాకులు కాల్చి మండలవ్యాప్తంగా కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. అనంతరం సూర్యదేవర రవికుమార్‌ స్వగృహంలో ఆయన మాట్లాడుతూ రెండు దఫాలుగా తనకు అవకాశం ఇచ్చి జిల్లా చైర్మన్‌ చేసిన ఘనత పెనుబల్లి రైతులకే దక్కుతుందని, మరోసారి కూడా తనను ఆదరించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎంతోమంది రైతులకు సొసైటీపరంగా చేసిన సేవలకు గుర్తింపుగా ఏకగ్రీవంగా తనను ఎన్నుకున్నందుకు రైతులకు రుణపడి ఉంటానన్నారు. రాష్ట్రంలో ఖమ్మం డీసీసీబీని అగ్రగామిగా నిలిపామని, రైతులను కంటికి రెప్పలా చూసుకున్నామని, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రైతులకు ఎన్నో రకాల సదుపాయాలు కల్పించామన్నా రు. తన ఎన్నికకు సహకరించిన ధన్యవాదాలు తెలిపా రు  

పాతకారాయిగూడెం....

పాతకారాయిగూడెం 13 మంది టీసీలకు గాను 8 టీసీలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఐదు టీసీలకు  ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి ప్రసాదరావు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన 8 మంది టీసీలు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారు.


logo
>>>>>>