గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Feb 10, 2020 , 01:07:23

నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌

నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌

ఖమ్మం, నమస్తే తెలంగాణ : అనారోగ్యం బారిన పడి ప్రైవేట్‌ వైద్యశాలలో వైద్యం చేయించుని ఆర్ధికంగా ఇబ్బందులు పడే నిరుపేదలకు సీఎంఆర్‌ఎప్‌ ఒక వరమని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. జిల్లాలో అనారోగ్య రీత్యా మెరుగైన వైద్యం పొందిన వారికి ఆర్ధిక వెసులుబాటు కల్పించేందుకు ఖమ్మం నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలువురి విన్నపం మేరకు మంత్రి సిఫారసు మేరకు మంజూరైన 68మంది లబ్ధిదారులకు తన క్యాంప్‌ కార్యాలయంలో చెక్కులను ఎమ్మెల్సీ బాలసాని, మేయర్‌ పాపాలాల్‌తో కలిసి చెక్కులు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్‌ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జిల్లాలో వైద్యం పొందిన వారికి సీఎం సహాయ నిధి నుంచి కోటి రూపాయలకు పైగా సహాయం అందిచినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సీఎంఆర్‌ఎప్‌ ఎంతో పారదర్శంకంగా అమలు జరుగుతుందన్నారు. వైద్య చికిత్సలు పొందినవారికి సీఎంఆర్‌ఎఫ్‌ సంజీవని లాంటిదన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా నిరుపేదలకు ఆదుకున్న కేసీఆర్‌కు  బాధితుల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. సీఎంఆర్‌ఎఫ్‌-67, ఎల్‌ఓసీ-1 మొత్తం 68మంది గాను  25.57 లక్షల రూపాయలు అందజేశామన్నారు. నేటి వరకు 410 మందికి లబ్ధి చేకూరిందని, అందుకు గాను రూ. 1.76 కోట్ల విలువగల నగదు చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళీ, టీఆర్‌ఎస్‌ ఖమ్మం నగర అధ్యక్షులు కమర్తపు మురళీ, ఆర్‌జేసీ కృష్ణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, కుర్రా భాస్కర్‌రావు, తుమ్మలపల్లి మోహన్‌రావు, గుత్త రవి తదితరులున్నారు.  


logo
>>>>>>