శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Khammam - Feb 10, 2020 , 01:05:59

‘చిరు’ ప్రయత్నం..

‘చిరు’ ప్రయత్నం..

అశ్వారావుపేట రూరల్‌ : చిరు ధాన్యాలు ఆరోగ్యాన్ని పంచడమేకాదు.. ఉపాధిని కూడా అందిస్తున్నాయి. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు చిరు ధాన్యాలతో పిండి వంటలు చేసి గిరిజన మహిళలు జీవనోపాధి పొందుతున్నారు. గతంలో చిరు ధాన్యాలతోనే ఆహారాన్ని తీసుకునేవారు. కాలంలో మార్పులకు అనుగుణంగా సన్నబియ్యం ఆహారంగా తీసుకుని రోగాలు పాలవటంతో తిరిగి పురాతన ఆహరపు ఆలవాట్లు పైపు విద్యావంతులు నుంచి పల్లేటూరి ప్రజల వరుకు మొగ్గుచూపుతున్నారు. చిన్న వయస్సులోనే బీపీ,ఘగర్‌ వంటి వ్యాధుల బారినపడటానికి తీసుకునే ఆహరమే ప్రధానమని గ్రహించిన ప్రజలు పురాత పంటలను ప్రోత్సహిస్తున్నారు. చూడగానే తినాలనిపించే..తింటే మరొకటి తినాలని...ఎన్ని తిన్నా జీర్ణమయ్యే  పదార్దాలు. పైగా ఆరోగ్యాన్ని పెంచే పోషక విలువలు ఉన్న బిస్కేట్లు.  ఇవి ఎక్కడో పేరొందిన కార్పొరేట్‌ కంపెనీలు, బేకరి షాపుల్లో తయారు చేసినవి కావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, మారుమూల గిరిజన గ్రామమైన రామన్నగూడెం గ్రామంలో అన్ని గిరిజన కుటుంబాలే జీవిస్తున్నాయి. కూలి పనులు చేసుకుంటేనే ఇల్లు గడిచేది. ప్రతీ రోజు కూలి పనులు లభించకపోవటంతో  ఇబ్బందులు పడేవారు. పక్క పట్టణాలకు వలస వెళ్లలేని పరిస్దితి. ఇటువంటి పరిస్దితిలో నాబార్డు నిదులు కేటాయించగా, వాసన్‌ సంస్ద సహకారం అందించి చిరుధాన్యాల పంటల సాగు, బిస్కేట్లు తయారీ గురించి అవగాహన కలిపించి ప్రోత్సహించటం  వల్ల రామన్నగూడెం చెందిన  4గురు గిరిజన మహిళలు శ్రీసాయి స్నాక్స్‌ అండ్‌ బిస్కేట్స్‌ పేరుతో తయారు చేసి జీవనోపాధి పొందుతున్నారు.నేటి తరం వారు,చిన్న పిల్లలకు మెచ్చే విధంగా, బేకరి బిస్కేట్లు తయారీ చేస్తు స్వయం ఉపాధి పొందుతున్నారు. నాబార్డు ఆర్దిక సహకారంతో మల్లాయిగూడెం వాటర్‌షేడ్‌ ఎస్‌డీపీ కార్యక్రమంలో భాగంగా సుమారు రూ ఒక లక్ష్య వ్యయం చేసి యంత్ర పరికరాలు కొనుగొలు చేశారు. వాసన్‌ సంస్ద సహకారంతో శ్రీకాకుళం జిల్లాలోని కొత్తపేట గ్రామంలో రాగి,కొర్ర, సజ్జ, జోన్నలు (చిరు ధాన్యాలు)లతో  బిస్కేట్లు, జంతికలు, లడ్డులు తయారు చేస్తున్న ఒక మహిళ గ్రూపు వద్ద రెండు రోజులు శిక్షణ పొందారు.  ఈ శిక్షణతోపాటుగా నాబార్డు ఏజీఎం బి వెంకటేశ్వరావు, వాసన్‌ సంస్ద ప్రతినిధులు కె సతీష్‌కుమార్‌, గీతారెడ్డిలు ప్రొత్సహంతో  హైద్రాబాద్‌లో దక్కన్‌చార్టు ఏర్పాటు చేసిన స్టాల్స్‌, ఉమ్మడి జిల్లాలో నాబార్డు ఏర్పాటు చేస్తున్న సమావేశాల్లోను, డీఆర్‌డీఏ ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోను, స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాటు చేసిన స్టాల్స్‌తోపాటు భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాలల్లో బిస్కేట్లు, జంతికలు విక్రయాలు చేస్తున్నారు. 

ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలకు.. 

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో పీవో గౌతమ్‌ను గిరిజన ధర్బార్‌లో   వాసన్‌ సంస్ద ప్రతినిధి కె సతీష్‌కుమార్‌, శ్రీసాయి గ్రూపు ఎం రమాదేవీ, ఎన్‌ కుమారీలు కలిసి శ్రీసాయి గ్రూపు స్నాక్స్‌ అండ్‌ బిస్కేట్స్‌ తయారీ గురించి వివరించారు. గిరిజన మహిళలు జీవనోపాధితోపాటు మార్కెటింగ్‌ సౌకర్యం కలిపించాలని విన్నవించుకున్నారు. చిరు దాన్యలతో చేస్తున్న బిస్కేట్లును చూపించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట,దమ్మపేట మండలాల్లో పైలెట్‌ ప్రాజెక్టు క్రింద ఆశ్రమ పాఠశాలలకు బిస్కేట్లు సరపరా కోసం ధరఖాస్తు చేసుకున్నారు. దీంతో జనవరి 2020 నుంచి ఆశ్రమ పాఠశాలలకు రెండు మండలాల్లో సరఫరాకు ఐటీడీఏ పీవో అనుమతులు ఇచ్చి గిరిజన మహిళలకు ఉపాధి చూపారు. రెండు మండలాల్లోని సుమారు మూడు వేల నుంచి 5వేల మంది విద్యార్దులకు వారానికి ఒక పూట బిస్కేట్లు పంపీణీ చేస్తున్నారు. ఒక్కొక్క బిస్కేట్‌ సుమారు 30 నుంచి 35 గ్రామాలు ఉండే విధంగా నాలుగు బిస్కేట్లు ఒక ప్యాకింగ్‌ చేసి ఒక విద్యార్దికి అందించే విధంగా ఆకర్షణీయంగా ప్యాకింగ్‌ చేసి సరఫరా చేస్తున్నారు. చాలా రకాల బిస్కేట్లు మార్కెటింగ్‌ జరుగుతున్న తరుణంలో ఐటీడీఏ పీవో గౌతమ్‌ తమకు అందించిన సహకారం మరవలేనిదని గిరిజన మహిళలు కఋతజ్ఞతలు తెలుపుతున్నారు. భద్రాచలం, దమ్మపేట జీసీసీ అధికారులు తమకు సహకారం అందిస్తున్నారని తెలిపారు.వచ్చే  విద్యా సంవత్సరానికి భద్రాద్రి జిల్లాలోని అన్ని వసతి గఋహలకు  అనుమతులు ఇవ్వాలని ఐటీడీఏ పీవోను కోరనున్నట్లు తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు, 

అంగన్‌వాడీలకు సరఫరా చేయాలన్నదే లక్ష్యం.. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలతోపాటు, మైనార్టీ, బీసీ,ఎస్సీ,ఎస్టీ బాలురు,బాలికల హస్టల్స్‌కు, అంగన్‌వాడీ కేంద్రాలకు  చిరుధాన్యాల బిస్కేట్లు సరపరా చేయాలన్నదే తమ లక్ష్యమని సాయి గ్రూపు మహిళలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముందుగా ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలకు సరపరాలో నాణ్యమైన సరకు సరఫరా చేసి ఐటీడీఏ అధికారుల మన్నలు పొందిన తరువాత ఇతర హస్టల్స్‌ పై దఋష్టి పెట్టునున్నట్లు మహిళ గ్రుపు సభ్యులు తెలిపారు. 

తృణ ధాన్యాలే పరిష్కారం.. 

అత్యధిక పోషక విలువలు ఉన్న తృణ ధాన్యాలను ఆహరంలో భాగం చేసుకోవడమే ప్రస్తుతం అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం. ఆరోగ్యవంతమైన జీవనంలో ఆహరం ప్రధాన పాత్ర పోషిస్తుంది. తినే ఆహరాన్ని బట్టి శారీరక స్దితి ఉంటుందని ఆయుర్వేదం చెబుతుంది. కోపం, చిరాకు, నిస్పత్తువ, భావోద్వేగాలు అదుపు తప్పడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని పరిశోదనల్లో వెల్లడైంది. అందుకే వీలైనంత వరుకు  సాత్విక ఆహరం తీసుకోవాలని యోగశాస్త్రం సూచిస్తుంది.


logo