శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Khammam - Feb 10, 2020 , 01:00:13

ముగిసిన నామినేషన్ల పరిశీలన

ముగిసిన నామినేషన్ల పరిశీలన

ఖమ్మం వ్యవసాయం : జిల్లా సహకార సంఘాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఆదివారం జిల్లాలోని 76 సొసైటీల్లో జరిగింది. ఆయా నియోజకవర్గాల వారీగా వచ్చిన నామినేషన్లను సంబంధిత ఎన్నికల అధికారులు పరిశీలించారు. అంసపూర్తిగా నింపిన దరఖాస్తులు, సరైన వివరాలు లేనివి, ముగ్గురు సంతానం కలిగిన వారు తదితర అంశాలను క్రోడికరించి సదరు నామినేషన్లను తిరస్కరించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆయా స్థానాలకు సంబంధించి మొత్తం 33 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు జిల్లా సహకార అధికారి కార్యాలయం అధికారులు తెలిపారు. మొత్తం 977 నామినేషన్లకు గాను 2,545 నామినేషన్లు దాఖలు అయిన సంగతి తెలిసిందే. వాటిలో 33 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. పరిశీలన పూర్తైన అనంతరం 2,512 మంది బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 15న జరుగనున్న ఎన్నికల కోసం ఆదివారం ఖమ్మం, మధిర, సత్తుపల్లి డివిజన్‌ కేంద్రాల్లో ఆయా సొసైటీలకు నియామకమైన ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు సంబంధిత ఎన్నికల అధికారులు శిక్షణ ఇచ్చారు. పోటీలో నిలిచిన అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు సోమవారం అవకాశం కల్పించారు. ఉపసంహరణ గడువు అనంతరం పోటీలో ఏఏ సొసైటీల్లో ఎంతమంది పోటీలో ఉండే జాబితాను ప్రకటించనున్నారు. మధ్యాహ్నం 3గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థులకు ఆయా సొసైటీల ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయిస్తారు. అనంతరం ఈ నెల 15న సహకార సంఘాలకు సంబంధించిన డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.  


logo