మంగళవారం 31 మార్చి 2020
Khammam - Feb 07, 2020 , 23:51:25

ఖాతాల్లోకి ‘సాయం’ సొమ్ము

ఖాతాల్లోకి ‘సాయం’ సొమ్ము

ఖమ్మం నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: యాసంగి సాగుకు సంబంధించిన రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఈ నెల 1 నుంచి ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పట్టాదారు పాసుపుస్తకాలు, ఆర్‌ఎఫ్‌ఆర్‌ పట్టాలు కలిగిన రైతుల వివరాలను ఆయా గ్రామాలకు చెందిన వ్యవసాయశాఖ విస్తరణ అధికారులు ఆన్‌లైన్‌లో పొందుపరచారు. వర్షాకాలంలో ఆశించిన మేర వర్షపాతం నమోదు కావడంతో అన్నదాతలు ఎంతో ఉత్సాహంగా సాగు చేపట్టారు. జిల్లాలో ప్రధాన పంట అయిన పత్తిపంట సాగు రికార్డు స్థాయిలో జరిగింది. జిల్లావ్యాప్తంగా 2.30 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు కాగా, కేవలం పత్తిసాగు దాదాపు 1లక్ష హెక్టార్లలో జరిగింది. సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలలో వరి ఎక్కువగా సాగు జరగగా, పాలేరు, ఖమ్మం, మధిర నియోజకవర్గాలలో పత్తి, మిర్చి సాగు ఎక్కువ మొత్తంలో జరిగింది. ప్రస్తుతం యాసంగి సీజన్‌లో అధికారులు జిల్లా వ్యాప్తంగా 51,769 హెక్టార్లలో వివిధ రకాల పంటల సాగు కావచ్చని అంచనా వేశారు. అయితే నేటి వరకు 92,057 హెక్టార్లలో సాగు పూర్తి చేశారు. వీటిలో వరి రికార్డు స్థాయిలో 61, 825 హెక్టార్లలో జరిగింది. ఒకవైపు రైతులు పంటల సాగు పూర్తి చేసే క్రమంలో అందుకు అవసరమైన ఎరువుల కొనుగోళ్లు తదితర అవసరాల నిమిత్తం ప్రభుత్వం రైతుబంధు పథకం సొమ్ము విడుదల చేస్తుండటంతో అన్నదాతలకు కలిసి వచ్చినైట్లెంది. 

యాసంగిలో 2,49లక్షల మంది గుర్తింపు 

ఈ సంవత్సరంలో యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు పథకానికి 2.49 265 మంది రైతులను గుర్తించారు. ఎకరానికి రూ.5వేల చొప్పున రూ. 308,78,90,197 కోట్లు అవసరం ఉండవచ్చని ప్రభుత్వం అంచనా. ఇప్పటికే ఆయా గ్రామాల వ్యవసాయశాఖ విస్తరణ అధికారులు బ్యాంక్‌ ఖాతాలు, ఇతర రైతుల వివరాలను పరిశీలన చేసి ట్రెజరీకి పంపించారు. ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో యాసంగి సీజన్‌కు సంబంధించిన సొమ్ము జమ అవుతున్నాయి. అయితే ఇందు కోసం ఈ దఫా విడతల వారీగా రైతుల అకౌంట్లలో సొమ్మ జమ అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగానే తొలి విడతలో సన్న చిన్నకారు రైతులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. తొలివిడతలో చిన్న రైతులు 65,004 మందికి గాను రూ.217,45,6,196 కోట్లను అందజేయనున్నారు. యాసంగి సీజన్‌కు సంబంధించిన సొమ్ము  మార్చి నెల చివరి వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. 

అన్నదాతలకు వరం ‘రైతుబంధు’

ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం నేడు రైతలకు వరంగా మారింది. గడిచిన నాలుగు సీజన్‌లుగా ప్రభుత్వమే పంటల పెట్టుబడికి ఆర్థిక సహాయం చేస్తుండటంతో అన్నదాతలకు పెట్టుబడి భారం తగ్గింది. ఉమ్మడి రాష్టంలో వ్యవసాయ సీజన్‌ వచ్చిందంటే సకాలంలో విత్తనాలు, ఎరువుల లేక ఇబ్బందులు, మరోవైపు పంటల పెట్టుబడికి చేతిలో డబ్బులు లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం పరిపాటిగా మారింది. దీంతో సాగుకు అనేక మంది రైతులు దూరం అయ్యేవారు. స్వరాష్ట్ర సాధన తరువాత సీఎం కేసీఆర్‌ ఆలోచన ఫలితంగా ప్రవేశ పెట్టిన రైతుబంధుతో అనేక మంది రైతులు ఇప్పుల ఊబినుంచి ఒడ్డున పడ్డారు. 


logo
>>>>>>