బుధవారం 01 ఏప్రిల్ 2020
Khammam - Feb 07, 2020 , 23:49:10

జోరుగా నామినేషన్లు..

జోరుగా నామినేషన్లు..

ఖమ్మం, వ్యవసాయం పిబ్రవరి 7: సహకార సంఘాల డైరెక్టర్లకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. రెండో రోజు ఆయా సొసైటీలకు కలిపి జిల్లా వ్యాప్తంగా 750 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణ తొలిరోజున 106 దాఖలయ్యాయి. మొత్తం రెండు రోజుల్లో కలిపి 856 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణకు శనివారం చివరి రోజు కావడంతో నేడు పూర్తిస్థాయిలో దాఖలు అయ్యే అవకాశం ఉంది. అయితే రెండో రోజు 10 సొసైటీల్లో కలిపి ఒక్క నామినేషన్‌ దాఖలు కాకపోవడం విశేషం. నేటితో గడువు ముగుస్తుండటంతో అభ్యర్థులు భారీగా నామినేషన్ల వేసే అవకాశం ఉంది. 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు మాత్రమే ఆయా సొసైటీల ఎన్నికల అధికారులు నామినేషన్లను స్వీకరిస్తారు. 9వ తేదీన పరిశీలన. 10న ఉపసంహరణ. అదే రోజున భరిలో నిలిచిన అభ్యర్థులకు అధికారులు తెలుగు అక్షర క్రమపద్దతిలో గుర్తులు కేటాయిస్తారు. 

నామినేషన్‌న్లకు నేడు చివరి రోజు 

సహకార సంఘాల పరిధిలో డైరెక్టర్ల కోసం నామినేషన్లు దాఖలు చేసే కార్యక్రమం నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 3గంటలలోపు స్వీకరించాలని ఇప్పటికే ఆయా సొసైటీల ఎన్నికల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. జిల్లావ్యాప్తంగా 11 స్థానాలకు మినహాయించి 977 స్థానాలకు మాత్రమే ప్రస్తుతం నామినేషన్లు అధికారులు స్వీకరిస్తున్నారు. రెండు రోజుల్లో 856 నామినేషన్లు దాఖలు చేశారు. నాచేపల్లి, మోటమర్రి, పెద్దబీరవల్లి, చిన్నకోరుకొండి సొసైటీలకు ఒక్క నామినేషన్‌ సైతం దాఖలు కాకపోవడం విశేషం. అయితే జిల్లాలో ఎక్కువ ఓటర్లు కలిగిన ఏదులాపురం, గార్లొడ్డు సొసైటీలకు నేటి వరకు ఒక్కో సొసైటీలో 30 చొప్పున దాఖలు అయ్యాయి. శనివారం చివరి రోజు కావడంతో నేటి వరకు దాఖలు కాని సొసైటీల్లో భారీగా  వచ్చే అకాశం ఉంది. 13 మంది డైరెక్టర్లకు గాను 13 నామినేషన్‌లు వచ్చిన పక్షంలో సదరు సొసైటీలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఎన్ని సొసైటీలు ఏకగ్రీవం అవుతాయని విషయం 10వ తేదీ తరువాత తేలనుంది.  

డీసీఓ కార్యాలయానికి ఎన్నికల సామగ్రి

ఈనెల 15న జరగబోయే సహకార ఎన్నికలకు సంబంధించిన సామగ్రి జిల్లా డీసీఓ కార్యాలయానికి చేరుతోంది. ఇప్పటికే పోలింగ్‌ బూత్‌లో అవసరమైన సిరా, స్టాంప్‌లు, ఇతర సామగ్రి కార్యాలయంకు చేరుకుంది. బ్యాలెట్‌ బాక్స్‌లు సైతం శుక్రవారం సాయంత్రం జిల్లా డీసీఓ కార్యాలయానికి చేరుకున్నాయి. ఎన్నికలకు తక్కువ వ్యవధి ఉన్నందున అధికారులు, సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. రాత్రి వేళలో సైతం కిందిస్థాయి సిబ్బంది పని చేస్తున్నారు. పోలింగ్‌ ముందు రోజే ఎన్నికల సామగ్రి, సిబ్బందిని చేరవేసేందుకు రూట్‌ మ్యాప్‌ తయారు చేశారు. ఇందు కోసం 76 సొసైటీలను మూడు డివిజన్‌లుగా విభజించారు. ఖమ్మం డివిజన్‌తో పాటు మధిర, సత్తుపల్లి డివిజన్ల వారిగా ప్రణాళిక సిద్ధం చేశారు. 9వ తేదీన పోలింగ్‌ నిర్వాహణకు నియమకమైన ఆయా శాఖల అధికారులు, ఇతర సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు సైతం ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే బ్యాలెట్‌ పత్రాలను సైతం సిద్ధం చేసే విధంగా కార్యాచరణ రూపొందించారు. 


logo
>>>>>>