మంగళవారం 31 మార్చి 2020
Khammam - Feb 07, 2020 , 23:44:14

భద్రాద్రి ఐటీడీఏ పీవోగా గౌతమ్‌ బాధ్యతల స్వీకరణ

 భద్రాద్రి ఐటీడీఏ పీవోగా గౌతమ్‌ బాధ్యతల స్వీకరణ

భద్రాచలం, నమస్తే తెలంగాణ ఫిబ్రవరి7: భద్రాచలం ఐటీడీఏ నూతన పీవోగా పోట్రు గౌతమ్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా భద్రాచలం చేరుకున్న పీవో రామున్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఈ సందర్భంగా పీవోకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయానికి చేరుకొని పీవోగా బాధ్యతలు చేపట్టారు. 

గత ఐటీడీఏ పీవోగా పనిచేసిన వీపీ గౌతమ్‌ ఐటీడీఏ కార్యాలయాన్ని అన్ని రంగాల్లో గాడిలో పెట్టేందుకు ఉత్సాహంగా పనిచేయడం జరిగింది. నూతన పీవోగా బాధ్యతలు చేపట్టిన పోట్రు గౌతమ్‌ తొలిరోజు బాధ్యతలు స్వీకరించిన వెంటనే సమావేశాలకు, పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఐటీడీఏ యూనిట్‌ అధికారులతో తక్షణ సమావేశమయ్యారు. తొలిరోజు విస్తృతంగా పర్యటించి ప్రతీ విషయంపై అవగాహన పెంపొందించుకునే దిశగా దూసుకపోయారు. గత పీవో మాదిరిగా నూతన పీవో కూడా యువకుడు కావడం, అదే తరహా పాలన అందుతోందన్న ఆకాంక్ష పలువురిలో వ్యక్తమైంది. 

ప్రజలకు సుపరిపాలన అందించడంలో అధికారుల సహాలు, సూచనలు తీసుకుంటా ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అందరు యూనిట్‌ అధికారులు హాజరు కావాలని తెలిపారు. ముందస్తు తన అనుమతి లేకుండా కార్యస్థానం విడిచి వెళ్లరాదని యూనిట్‌ అధికారులకు సూచించారు. తక్షణం సమాచారం కొరకు వాట్సాప్‌ ద్వారా సందేశాన్ని పంపనున్నట్లు చెప్పాకరు. ఫైల్స్‌ పెండింగ్‌లో ఉంటే ఎంత మాత్రం సహించనని, ఐటీడీఏ పరిధిలో ఉన్నకార్యాలయాలకు సంబంధించిన శాఖల వారీగా సమగ్ర నివేదికలను అందజేయాలని పీవో తెలిపారు. ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలకు సన్నద్దం అవుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నట్లు వివరించారు. నూరుశాతం ఫలితాలు సాధనకై కృషి చేయాలన్నారు. 


logo
>>>>>>