శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Khammam - Feb 07, 2020 , 23:41:43

ఓటర్ల తుది జాబితా విడుదల

ఓటర్ల తుది జాబితా విడుదల

ఖమ్మం, నమస్తే తెలంగాణ: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం 2020లో భాగంగా శుక్రవారం ఖమ్మంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (ఈఆర్‌వో), అసిస్టెంట్‌ ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (తహసీల్దార్‌) కార్యాలయాలలో తుది ఓటర్ల జాబితా వెలువడింది. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోని ఓటర్లందరూ ఏపీ సిరీస్‌తో మొదలయ్యే 14 డిజిట్‌లు గల పాత ఓటరు గుర్తింపు కార్డులు, నాన్‌ స్టాండర్డ్‌ ఈపీఐసీఎస్‌ను 10 డిజిట్లు గల నూతన ఓటరు గుర్తింపు కార్డులుగా భారత ఎన్నికల సంఘం మార్చింది. ఈ జాబితా అసిస్టెంట్‌ ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు, తహసీల్దార్ల అందరి వద్ద అందుబాటులో ఉన్నాయి. సంబంధిత ఓటర్లందరూ ఈ జాబితాను సరిచూసుకోవాలని సూచించారు. 


logo