మంగళవారం 31 మార్చి 2020
Khammam - Feb 07, 2020 , 01:40:03

కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం అవసరం

కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం అవసరం

కొత్తగూడెం లీగల్‌: కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం అవసరమని కొత్తగూడెం ఐదో అదనపు జిల్లా జడ్జి మహ్మద్‌ అబ్దుల్ఫ్రీ అన్నారు. కొత్తగూడెం కోర్టులో శనివారం నిర్వహించే జాతీయ మెగా లోక్‌ అదాలత్‌పై గురువారం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన న్యాయమూర్తులు, న్యాయవాదుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం కోర్టుల ఆవరణలో శనివారం జాతీయ మెగాలోక్‌ అదాలత్‌ జరుగనుందని, ఎక్కువ కేసుల పరిష్కారానికి న్యాయవాదుల సహకారం అవసరమన్నారు. లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కారమయ్యే కేసుల్లో కోర్టు ఫీజు తిరిగిపొందే అవకాశం ఉంటుందని, తీర్పు అప్పీల్‌లేని అంతిమ తీర్పుగా పరిగణించబడుతుందన్నారు. కక్షిదారులు అధిక సంఖ్యలో పాల్గొని తమ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో వారి సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. బార్‌ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం ఎప్పుడూ ఉంటుందని, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి జీ శ్రీనివాస్‌, ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పాలాది శిరీష, కార్యవర్గ సభ్యులు పెసరమిల్లి నాగేశ్వరరావు, జనపరెడ్డి గోపీకృష్ణ, మునిగడప వెంకటేశ్వర్లు, గడిపెల్లి మహేశ్వరరావు, చావా కృష్ణకుమారి, అత్తులూరి మనోరమ, మెండు రాజమల్లు, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.


logo
>>>>>>