శనివారం 28 మార్చి 2020
Khammam - Feb 06, 2020 , 00:29:23

ఇల్లు వదిలివచ్చిన ఇద్దరు మైనర్‌ బాలురు..

  ఇల్లు వదిలివచ్చిన ఇద్దరు మైనర్‌ బాలురు..

మధిర, నమస్తేతెలంగాణ, ఫిబ్రవరి5: మధిర రైల్వేస్టేషన్‌లో గుంటూరు టూ సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఇద్దరు మైనర్‌ బాలురు ఇంటి నుంచి పారిపోయి మధిర రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌పై బుధవారం తచ్చాడుతుండగా రైల్వేహెడ్‌కానిస్టేబుల్‌ వేణుగోపాలరెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి వారిని గమనించి మధిర జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ పిల్లలను విచారించగా మొదటి బాలుడు బండారి ప్రవీణ్‌కుమార్‌ తండ్రి హరిబాబు గ్రామం నకిరేకల్‌ అని, రెండో బాలుడు పేరు బత్తుల ప్రకాశ్‌ తండ్రి గంగరాజు, నర్సారావుపేట, గుంటూరు జిల్లాగా వివరించినట్లు తెలిపారు. వీరిని విచారించిన రైల్వే పోలీసులు వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. logo