గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Feb 06, 2020 , 00:24:16

తండ్రి కొడుకు దివాళా పిటిషన్ల దాఖలు

తండ్రి కొడుకు దివాళా పిటిషన్ల దాఖలు

ఖమ్మం లీగల్‌, ఫిబ్రవరి 5: ఖమ్మం నగరంలో తండ్రి కొడుకులు దివాళా పిటిషన్లను బుధవారం ఖమ్మం సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం నగరంలోని యూపీహెచ్‌ కాలనీకి చెందిన తండ్రి, కొడుకు వ్యాపారం నిర్వహించేవారు. తండ్రి కాకి వెంకటరెడ్డి ఫెర్టిలైజర్‌ దుకాణం, అతని కుమారుడు సందీప్‌రెడ్డి సిమెంట్‌ వ్యాపారం చేసేవారు. కాకి వెంకటరెడ్డి రూ. 1కోటి 97లక్షల 93వేలకు, సందీప్‌రెడ్డి రూ.22 లక్షల 50వేలకు దివాళా పిటిషన్‌లు దాఖలు చేశారు. వారికి వ్యాపారంలో ఒడిదిడుకుల వలన నష్టం వచ్చిందని, అధిక వడ్డీలకు అప్పులు తేవడంతో తెచ్చిన అప్పులు పెరిగిపోవడం ప్రతివాదుల నుంచి కూడా ఒత్తిడి అధికమవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో దివాల పిటిషన్‌లు దాఖలు చేసినట్లు వారు పేర్కొన్నారు. దివాళా పిటిషన్‌దారుల తరఫున న్యాయవాదులుగా ఎండీ అజీజ్‌ పాషా, బీ వెంకటేశ్వర్లు వ్యవహరిస్తున్నారు.


logo