మంగళవారం 07 జూలై 2020
Khammam - Feb 03, 2020 , 03:21:29

‘పవర్‌వీక్‌'తో విద్యుత్‌ సమస్యలు దూరం

‘పవర్‌వీక్‌'తో విద్యుత్‌ సమస్యలు దూరం

చింతకాని, పిబ్రవరి 2: సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో భాగమైన ‘పవర్‌వీక్‌'తో పల్లెల్లో విద్యుత్‌ సమస్యలు దూరమయ్యాయని ఖమ్మం విద్యుత్‌శాఖ డీఈలు ఎల్‌ రాములు, ఎన్‌ రామారావులు పేర్కొన్నారు. మండల కేంద్రంలో సబ్‌స్టేషన్‌ను ఆదివారం వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌ రికార్డులు, విద్యుత్‌ సరఫరా తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పల్లెప్రగతి ప్రణాళికతో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం ప్రగతి ప్రణాళికా కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని, కోన్ని ఏళ్ల నాటి విద్యుత్‌ సమస్యలు సైతం పల్లె ప్రగతిలో పరిష్కారం అయ్యాయని వారు పేర్కొన్నారు. రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను 24 గంటల పాటు అందిస్తున్నామని, స్టాటర్‌లు రైతులు వాడొద్దని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈలు కోడి లింగయ్య, చావా శ్రీధర్‌, సిబ్బంది రాయల ప్రసాద్‌, ప్రభాకర్‌, సుధా శ్రీను, సాయిల్‌, కోటేశ్వరరావు, షేక్‌ సలీం పాషా, వేణు, జాకీర్‌, రాజు, కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.     logo