ఆదివారం 29 మార్చి 2020
Khammam - Feb 01, 2020 , 23:49:34

ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రారంభం

ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రారంభం

ఖమ్మం ఎడ్యుకేషన్‌ : ఇంటర్మీడియట్‌ సాధారణ, ఓకేషనల్‌ విద్యా కోర్సులు అభ్యసిస్తున్న సైన్స్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ప్రయోగ పరీక్షల్లో ఆన్‌లైన్‌లో ప్రశ్నాపత్రాన్ని అందించారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు సంబంధిత డిపార్ట్‌మెంటల్‌ అధికారికి మెసెజ్‌ రూపంలో వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ అందింది. దాని ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో ప్రశ్నాపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని విద్యార్థులకు అందించారు. ఎక్కడా సాంకేతిక సమస్యలు రాకుండా ఆన్‌లైన్‌ ప్రయోగం నిర్వహించారు. 


ఒకటి రెండు కళాశాలల్లో ప్రశ్నాపత్రం వెంటనే వచ్చినా విద్యార్థులకు మాత్రం కొంత ఆలస్యంగా ఇచ్చారు. వచ్చిన ప్రశ్నలను సంబంధిత సబ్జెక్ట్‌ అధ్యాపకులు చూసిన తర్వాత విద్యార్థులకు చేరవేశారు.  ఇప్పటి వరకు ఆఫ్‌లైన్‌ పద్ధతిలో ప్రయోగ పరీక్షలు నిర్వహించారు.  ప్రాక్టికల్స్‌కు హజరైన విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో ప్రశ్నాపత్రం రావడమనే భావనతో నిర్వాహకులు ఆన్‌లైన్‌ ప్రశ్నాపత్రంతో ప్రయోగాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులతో తోలుత వారి ప్రయోగాల ఆధారంగా సంబంధిత విభాగాలకు సంబంధించి సమాధాన పత్రాలు రాయించి, ఫలితం వచ్చిన తర్వాత పరీక్షను పూర్తి చేయించారు. 


 22 కేంద్రాల్లో ప్రయోగ పరీక్షలు.. 

 జిల్లా వ్యాప్తంగా తొలి దశలో 22  జూనియర్‌ కళాశాలలో ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించారు. ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లోని విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరిగాయి.


logo