బుధవారం 01 ఏప్రిల్ 2020
Khammam - Feb 01, 2020 , 23:41:33

కుటుంబ కలహాలతో భార్యను హతమార్చిన భర్త

కుటుంబ కలహాలతో భార్యను హతమార్చిన భర్త

మధిరరూరల్‌ : కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త హతమార్చిన సంఘటన శనివారం మండలంలోని రాయపట్నం గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ వేణుమాధవ్‌ కథనం ప్రకారం.. మండలంలోని రాయపట్నం గ్రామానికి చెందిన తేళ్ల వెంకటప్రసాద్‌, శ్రీలతలకు గత 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి సాయి, స్వాతి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటప్రసాద్‌కు భార్యను తరచూ అనుమానిస్తూ గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో వీరి మధ్య మనస్పర్థలు పెరిగి ఒకే ఇంట్లో వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్య శ్రీలత (35)ను వెంకటప్రసాద్‌ గొంతు నులిమి చంపేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న మధిర సీఐ వేణుమాధవ్‌, మధిర పట్ణణ ఎస్సై ఉదయ్‌కుమార్‌తో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. బంధువులను సంఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  


logo
>>>>>>