మంగళవారం 31 మార్చి 2020
Khammam - Jan 31, 2020 , 05:05:42

మోగిన నగారా

మోగిన నగారా
  • ఫిబ్రవరి 3న నోటిఫికేషన్‌ జారీ
  • టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టేందుకు రైతులు సిద్ధం
  • జిల్లాలోని 21 మండలాల్లో 76 సొసైటీలు
  • అధిక సొసైటీలున్న రెండో జిల్లాగా ఖమ్మం
  • 6, 7, 8 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ

(ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ)కొద్ది రోజుల క్రితమే మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. పాలకవర్గాల ప్రమాణ స్వీకారాలు సైతం పూర్తయ్యాయి. ఇంతకుముందే సహకార ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి. అన్ని ఎన్నికల మాదిరిగానే సొసైటీల ఎన్నికలు సైతం చేపట్టాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ సొసైటీల ఎన్నికలకు ఇప్పుడు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో అధికారిక నోటిఫికేషన్‌ వెలవడనుంది. ఫిబ్రవరి 15లోపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సోసైటీల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో మరోసారి ఎన్నికల వాతావరణం ఏర్పడనుంది. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీల్లో అలజడి ప్రారంభమైంది. ప్రస్తుతం జిల్లాలో 21 మండలాల పరిధిలో 76 సోసైటీలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 1.80 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ప్రతి మండలానికీ రెండు సోసైటీలు ఉండాలనే ఉద్దేశంతో కొద్దిరోజుల క్రితమే మరో ఆరు సోసైటీలను ఏర్పాటు చేశారు. అయితే నూతన సోసైటీలకు సైతం ఎన్నికలు జరుగుతాయా? పాత సోసైటీల ప్రకారమే జరుగుతాయా? అనేది ఒకటి రెండు రోజుల్లో తేలనుంది.


రాష్ట్రంలో నిజామాబాద్‌ జిల్లా తరువాత ఎక్కువ సోసైటీలు కలిగిన జిల్లాగా ఖమ్మం ఉంది. కాగా రాబోయే సహకార ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌కు మరోమారు పట్టకట్టేందుకు రైతులు ఆసక్తితో ఉన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో అన్నదాతలకు అందిన పథకాలు అందుకు కారణం కానున్నాయి. 


స్వరాష్ట్రంలో తొలిసారిగా.. 

రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొలిసారిగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. చివరిగా 2013 జనవరి 31, ఫిబ్రవరి 3 తేదీల్లో జిల్లాలో 73 సొసైటీలకు ఎన్నికలు జరిగాయి. పెద్దబీరవెల్లి, నారాయణపురం, బ్రాహ్మణపల్లి సొసైటీలకు ఎన్నికలు జరగలేదు. గతంలో ఆ సొసైటీల విలీనం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఆ ప్రాంత వాసులు కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు జరగలేదు. ఈ దఫా అన్ని సోసైటీలకూ ఎన్నికలు జరగనున్నాయి. 2018లోనే సొసైటీల కాలపరిమితి ముగిసనప్పటికీ నూతన సహకార చట్టం తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఎన్నికలను వాయిదా వేసింది. ఆ తరువాత కూడా ఆ గడువును మళ్లీ మళ్లీ పొడిగిస్తూ వచ్చింది. ఈ నెల 31, వచ్చే నెల 3తో పాలకవర్గాల గడువు ముగుస్తుండడంతో తక్షణం ఎన్నికలు జరపాలని సీఎం నిర్ణయించారు. 


ఏర్పాట్లలో యంత్రాంగం..

ఇప్పటికే సహకార సంఘాల ఎన్నికలు ఆలస్యం కావడంతో తక్షణం ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో గురువారం ఉదయం నుంచే జిల్లా సహకార సంఘాల అధికారి అందుబాటులో ఉన్న ఉద్యోగులు, అధికారులు, ఆయా సోసైటీల సీఈవోలతో సమీక్ష చేపట్టారు. ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితా ముసాయిదా, సోసైటీల వారీగా వార్డుల ఏర్పాటు, అవసరమైన ఎన్నికల సిబ్బంది తదితర అంశాలపై చర్చించారు. ఇప్పటికే తయారైన లిస్టును పరిశీలించారు. నూతనంగా ఏర్పడిన సొసైటీలు, అభ్యంతరాల గురించి ఆరాతీశారు. కార్యాలయానికి వచ్చిన ఆయా సోసైటీల బాధ్యులతో ఆయన వరుసగా భేటీ అయి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఆరేళ్లలో అనేక సంస్కరణలు

ధికారులు, ఆయా సోసైటీల సీఈవోలతో సమీక్ష చేపట్టారు. ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితా ముసాయిదా, సోసైటీల వారీగా వార్డుల ఏర్పాటు, అవసరమైన ఎన్నికల సిబ్బంది తదితర అంశాలపై చర్చించారు. ఇప్పటికే తయారైన లిస్టును పరిశీలించారు. నూతనంగా ఏర్పడిన సొసైటీలు, అభ్యంతరాల గురించి ఆరాతీశారు. కార్యాలయానికి వచ్చిన ఆయా సోసైటీల బాధ్యులతో ఆయన వరుసగా భేటీ అయి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. 


ఆరేళ్లలో అనేక సంస్కరణలు 

తెలంగాణ రాష్ట్రం అవిర్భావం తరువాత ఖమ్మం డీసీసీబీ పరిధిలో ఉమ్మడి జిల్లాలోని 101 సొసైటీలకు నూతన ఒరవడి వచ్చింది. జిల్లాలో ఉన్న 76 సొసైటీలకుగాను ప్రస్తుతం 70 సోసైటీలకు సొంత భవనాలు కలిగి ఉండడమే కాకుండా అవసరమైన గోదాముల సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో సోసైటీ నిర్వాహకులు స్వేచ్ఛగా వ్యాపార కార్యకలాపాలు కొనసాగించేందుకు అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం అన్ని సొసైటీలు కంప్యూటరీకరణ చేయడంతో పాటు ఆడిట్‌ సైతం ఆన్‌లైన్‌లోనే జరుగుతుండడం విశేషం. ప్రస్తుతం జిల్లాలోని అన్ని సొసైటీలూ పంటల కొనుగోళ్లు చేపట్టడంతో లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఇతర వ్యాపారాలూ చేస్తున్నాయి. గతంలో సొసైటీ సీఈవో వేతనాలు తీసుకోవడమే గగనమైన పరిస్థితి నుంచి నేడు సొంత పెట్టుబడితో వ్యాపారాలు చేసుకునే స్థాయికి సంఘాలు బలపడ్డాయి. 

 76 సొసైటీలు,1.80 లక్షలమంది సభ్యులు..

ప్రస్తుత గణంకాల ప్రకారం 21 మండలాల పరిధిలో 76 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 1.80 లక్షల మంది రైతులు సభ్యత్వం తీసుకుని ఉన్నారు. అయితే 2018కి ముందుగా సభ్యత్వం తీసుకున్న వారి వివరాల ప్రకారం నూతన ఓటర్ల లిస్టు తయారుచేస్తారా? లేక 2019 డిసెంబర్‌కు ముందు వరకు సభ్యత్వం తీసుకున్న వారికి ఓటు హక్కు కల్పిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా నూతన సహకార చట్టానికి అనుగుణంగా ప్రతి మండలంలోనూ కనీసం 2 సోసైటీలు ఉండాలనే ఉద్దేశంతో కొద్ది రోజుల క్రితం ఖమ్మం రూరల్‌ మండలంలో ఎం వెంకటాయపాలెం, మద్దులపల్లి, కారేపల్లి మండలం మాణిక్యారం, ఏన్కూరు మండలం బురద రాఘవాపురం, ఖమ్మం అర్భన్‌ మండలం అల్లిపురం, కొణిజర్ల మండలం సింగరాయపాలెంలలో నూతన సోసైటీలను ఏర్పాటు చేసి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అయితే వీటికి ఓటర్ల జాబితా బదలాయింపు పూర్తి కాలేదు. 


ప్రతి సొసైటీకీ 13 మంది డైరెక్టర్లు..

జిల్లాలోని ప్రతి సొసైటీకీ 13 మంది డైరెక్టర్లు ఉండే విధంగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఓటర్లు ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా 13 మంది డైరెక్టర్లు ఉండే అవకాశం ఉంది. ఓటర్లకు అనుగుణంగా డైరెక్టర్లకు వార్డుల విభజన జరగనుంది. వంద నుంచి మొదలుకొని ఎన్ని వేలమంది ఓటర్లు ఉన్నప్పటికీ 13 డైరెక్టర్లు ఉండనున్నారు. వీరిలో రిజర్వేషన్ల ప్రకారంగా ఆయా వార్డులు రిజర్వు కానున్నాయి. ఎస్సీ జనరల్‌, ఎస్టీ జనరల్‌, బీసీ జనరల్‌తోపాటు ఇతరులు ఉంటారు. వీరితోపాటు ఎస్సీ మహిళ, జనరల్‌ మహిళలకు సైతం అవకాశం కల్పించనున్నారు. డైరెక్టర్‌ పరిధిలోని ఓటర్ల జాబితాకు అనుగుణంగా ఆ ప్రాంతంలో ఓటర్లు ఏ సామాజికవర్గం వారు ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతం ఆ సామాజిక వర్గానికి రిజర్వు అయ్యే అవకాశం ఉంది. 13 మంది డైరెక్టర్లు ఒక చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. 


ఆశావాహుల్లో సందడి..

సొసైటీలకు తక్షణం ఎన్నికలు జరపాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో జిల్లాలో అశావాహుల్లో ఒక్కసారిగా సందడి ప్రారంభమైంది. దీంతో గురువారం అన్ని రాజకీయ పార్టీల నాయకులు చర్చల్లో నిమగ్నమయ్యారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో జరిగిన డీసీసీబీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో అప్పట్లో టీడీపీకి అభ్యర్థులకు డీసీసీబీ చైర్మన్లయ్యే అవకాశం కలిగింది. ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికైన మువ్వా విజయ్‌బాబు తరువాత టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. అనంతరం వివిధ సొసైటీలకు చెందిన మెజార్టీ చైర్మన్లు, డైరెక్టర్లు కూడా టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వచ్చారు. గడిచిన ఎన్నికల్లో 90 శాతం సర్పంచ్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుచుకోవడంతో సొసైటీలను కూడా అదే పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతున్నది


logo
>>>>>>