సోమవారం 30 మార్చి 2020
Khammam - Jan 30, 2020 , 02:33:33

సమృద్ధిగా సాగునీరు..

సమృద్ధిగా సాగునీరు..
  • మే నెల వరకు ఆయకట్టుకు సాగునీటి విడుదల..
  • అందుబాటులో ఎరువులు, రైతుబంధుతో ఆసరా
  • చివరి ఆయకట్టు వరకు రెండో పంటకు పుష్కలంగా నీరు..
  • పొలం పనుల్లో అన్నదాతలు బిజీ

కూసుమంచి, జనవరి 29: నీటి కట కటలతో రెండో పంటపై నీలి నీడలు కమ్ముకొని దశాబ్ధాలుగా సమస్యలు చవిచూస్తున్న రైతులకు ఈసారి తెలంగాణ సర్కారు ముందు చూపు, అధిక వర్షాలతో పంట పొలాలు జలకళను సంతరించుకుటున్నాయి. సాగర్‌ ఎడమ కాలువ కింద మొదటి జోన్‌ నల్లగొండ జిల్లా, రెండో జోన్‌ ఖమ్మం జిల్లా, మూడో జోన్‌ కృష్ణా జిల్లాలకు చెందిన 9 లక్ష ఎకరాలు సాగు అవుతుంది. యాసంగికి సాగునీటిని పూర్తి స్థాయిలో అందివ్వటం కోసం సాగర్‌ ఉన్నతాధికారులు తీసుకున్న  నిర్ణయానికి కృష్ణా నీటి యాజమాన్య బోర్డు సానుకూలంగా స్పందించింది. ఎడమ కాలువకు వాటా కింద నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు 75 టీఎంసీల నీటి విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో రెండో పంటకు ఎలాంటి ఇబ్బంది లేకుడా నీరు అందే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో ప్రాజ్టె నీటి మట్టం పడిపోకుండాశ్రీశైలం నుంచి నీటిని తీసుకొని యాసంగికి నీటి సమస్యను తీర్చినున్నారు. జిల్లాలో పాలేరు రిజర్వాయర్‌ కింద చెరువుమాధారం, వైరా, లంకాసాగర్‌ కల్లూరు వంటి పెద్ద చెరువులు కింద ఆయకట్టుకు సాగునీటిని వదులుతున్నారు. 


పాలేరు నీటిమట్టం తగ్గకుండా చర్యలు... 

4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలేరు 20 అడుగులకు తగ్గకుండా ఎన్‌ఎస్పీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కింది భూములకు నీటి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో నీటిని వదులుతున్నారు. అందుచేత 16.5 అడగుల నీటి మట్టం ఉంది. క్రమంగా ఇన్‌ఫ్లో పెంచి అవుల్‌ఫ్లో తగ్గించి 20 అడుగులకు తగ్గకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  పాలేరు జలాశయం కింద జిల్లాలో 18 మండలాల్లో 1.5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. గతంలో అనేక మార్లు నీటి కొరత కారణంగా ఆయకట్టుకు పరిమితంగా సాగునీరు ఇవ్వటంతో రైతుల్లో తీవ్ర నిరాశ మిగిల్చింది. పూర్తి ఆయకట్టుకు సాగుకు ఎన్‌ఎస్పీ అధికారు కావాల్సిన నీటి అంచానాలు వాటి కొలమానాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.


పాలేరు నుంచే మూడో జోన్‌ నీరు..

పాలేరు నుంచి మూడో జోన్‌లో 3 లక్షల ఎకరాలకు కృష్ణా జిల్లాలో ఆరుతడి పంటలకు ఇక్కడి నుండే సాగు నీటిని విడుదల చేస్తున్నారు. నీటి నిర్వహణ కోసం కాలువపై  కృష్ణా బోర్డు ఆదేశాలతో నీటి మీటర్లు ఏర్పాటు చేశారు. వాటా ప్రకార వాడుకోంటున్నారా? లేక ఎక్కువ తక్కువలు వాడుతున్నారా? అనేది డిజిటల్‌ మీటర్ల ద్వారా నమోదు చేసుక్తన్నారు. వీటిని తరచూ తనిఖీలు చేస్తూ నీటి కొలతలు తీసుకొంటున్నారు. పాలేరు అవుట్‌ ఫాల్‌ కాలువ వద్ద, నాయకన్‌గూడెం ఇన్‌ ఫాల్‌ కాలువలపై నీటి మీటర్లు ఏర్పాటు చేశారు. వాటా ప్రకారం కాకుండా నీటి వాడకాలు జరిగినట్లు గుర్తిస్తే నీటి సరఫరాలో కోత విధించే వీలుగా మీటర్లు ఏర్పాటు చేశారు. 


logo