సోమవారం 30 మార్చి 2020
Khammam - Jan 30, 2020 , 02:19:57

మున్సిపాలిటీలను అభివృద్ధి చేయండి..

మున్సిపాలిటీలను అభివృద్ధి చేయండి..


మధిర, నమస్తేతెలంగాణ: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి,  యువనేత కేటీఆర్‌ను మధిర మున్సిపాలిటీ నూతన పాలకవర్గం బుధవారం హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి కేటీఆర్‌ మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీఆర్‌ఎస్‌ వార్డు కౌన్సిలర్లకు అభినందించారు. పారదర్శక పాలన అందిస్తూ మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించేందుకు కృషిచేసిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతా మధులను అభినందించారు. మధిర మున్సిపాలిటీలోని 10వ వార్డులో టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయిన సుశీల విద్యాసంస్థల అధినేత కరివేద వెంకటేశ్వరరావును డోంట్‌వర్రీ బ్రదర్‌ మేమున్నామంటూ భరోసా కల్పించారు. మధిర మున్సిపాలిటీలో 11వ వార్డులో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన గద్దల మాధురిని అభినందించారు. అదేవిధంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను హైదరాబాద్‌లోని ఆయన చాంబర్‌లో మధిర మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీతి, నిజాయితీతో ఆదర్శవంతమైన  పాలనను అందించాలన్నారు. మంత్రి పువ్వాడకు మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మధిర మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొండితోక లత, వైస్‌ చైర్‌పర్సన్‌ యరమల విద్యాలత, వార్డుకౌన్సిలర్లు, నాయకులు శీలం వెం కటరెడ్డి, మొండితోక జయాకర్‌, చుంచు విజయ్‌, చావా రామకృష్ణ, రంగిశెట్టి కోటేశ్వరరావు, బిక్కి కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ: సత్తుపల్లి మున్సిపాలిటీ నూతన పాలకవర్గంఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసిబుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి,  యువనేత కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు  ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు లిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ తోట సుజలారాణిలు కేటీఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛం ఇ చ్చి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ముందుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పువ్వాడలను కలిసిన అనంతరం వారితో కలిసి తెలంగాణ భవన్‌కు వెళ్లారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్‌ పల్లా రాజేశ్వరరెడ్డి, వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్‌తో పాటు కౌన్సిలర్‌ షేక్‌ చాంద్‌పాషా, టీఆర్‌ఎస్‌ నాయకులు తోట గణేశ్‌, కమల్‌పాషా, సందీప్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.


వైరా, నమస్తే తెలంగాణ: మంత్రులు కేటీఆర్‌,  పువ్వాడ అజయ్‌కుమార్‌లను వైరా ఎమ్మెల్యే లా వుడ్యా రాములునాయక్‌ బుధవారం వేర్వే రుగా కలిశారు. వైరా మున్సిపాలిటీ నూతనచైర్మన్‌ సూతకాని జైపాల్‌, వైస్‌ చైర్మన్‌గా ముళ్ళపాటి సీతారాములుతో కలిసి హైదరబాద్‌లో ఎమ్మెల్యే మంత్రులను కలిశారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తన ఛాంబర్‌లో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైరా మున్సిపాలిటీ చైర్మన్‌, కలిసి వైరా ఎమ్మెల్యే  హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడకు  పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్‌లో రాష్ట్ర మున్సిపాల్‌ శాఖామంత్రి కేటీఆర్‌ను ఎమ్మెల్యే  మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం  అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి  జైపాల్‌,సీతారాములుకు శు భాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైరా మాజీ ఎమ్మె ల్యే బానోత్‌ మదన్‌లాల్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు పసుపులేటి మోహన్‌రావు పాల్గొన్నారు. 

ఇల్లందు నమస్తే తెలంగాణ:మంత్రి  కేటీఆర్‌ను ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ నాయక్‌, ఇల్లెందు మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు,వైస్‌ చైర్మన్‌ ఎస్‌డీ జానిలు కలిశారు. బుధవారం హైదారాబాద్‌లోని  తెలంగాణ భవనంలో  కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.ఇల్లెందు మున్సిపల్‌ చైర్మన్‌,వైస్‌ చైర్మన్‌లుగా ఎన్నికైన దమ్మాలపాటి వెంకటేశ్వరరావు,ఎస్‌డీ జానిలను అభినందించారు.ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికలలో అన్నీ తానై విజయపథం నడిపించిన ఎమ్మె ల్యే బానోత్‌ హరిప్రియనాయక్‌ను ప్రశంసించారు. అనంతరం ఖమ్మం  ఎంపీ నామా నాగేశ్వరరావుని  కలిశారు.ఈ కార్యక్రమం లో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధుతదితరులు పాల్గొన్నారు.

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: కేటీఆర్‌ను  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నేతృత్వంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కాపు సీతాలక్ష్మీ, వైస్‌ చైర్మన్‌ దామోదర్‌లు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 


logo