బుధవారం 01 ఏప్రిల్ 2020
Khammam - Jan 28, 2020 , 23:52:28

అంతా ‘రామదాసు’ మయం..

అంతా ‘రామదాసు’ మయం..

ఇల్లెందు రూరల్‌, జనవరి 28 : జిల్లాలోని గురుకుల విద్యాసంస్థల్లో ఇప్పుడు ఒక్కటే చర్చ. అదే సుదిమళ్ళ గిరిజన గురుకులం గురించి. ఇక్కడ పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఈసం సిరివెన్నెల దక్షిణాఫ్రికాలోని కిలిమాంజారో పర్వతారోహణ చేయడంతో అందరి దృష్టి ఈ పాఠశాలపై పడింది. పర్వతారోహణ చేసిన సిరివెన్నెలను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ, గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అభినందించారు. నాలుగు రోజుల సాహస యాత్రకు వెళ్లి మంగళవారం తిరిగి గురుకులానికి వచ్చిన విద్యార్థి సిరివెన్నెలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.


పేదరికాన్ని అధిగమించి..

సుదిమళ్ల గురుకులంలో పదో తరగతి చదువుతున్న ఈసం సిరివెన్నెల ఇక్కడ ఆరో తరగతిలో చేరింది. గుండాల మండలం రోళ్లగడ్డ గ్రామపంచాయతీ నర్సాపురం గ్రామానికి చెందిన సిరివెన్నెల తల్లిదండ్రులు ఈసం సులోచన, ఈసం లక్ష్మయ్య. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం. చిన్నపాటి ఇల్లు. ఉన్న కొద్దిపాటి పొలంలో సాగుచేసుకుంటూ, ఖాళీ సమయాల్లో కూలీ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నిరక్షరాస్యులైన వారు తమపిల్లలను ప్రయోజకులను చేయాలన్న ఉద్దేశంతో విద్యాబుద్దులు నేర్పిస్తున్నారు. ఇద్దరు సంతానంలో కుమార్తె సిరివెన్నెల కాగా మరొకరు కుమారుడు ఉన్నారు. కుమార్తె సుదిమళ్ల గిరిజన గురుకులంలో పదో తరగతి చదువుతుండగా కుమారుడు గుండాల ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. మారుమూల గ్రామానికి చెందిన సిరివెన్నెల దక్షిణాఫ్రికాలోని కిలిమాంజారో పర్వతాన్ని అదిరోహించి అందరి దృష్టిని ఆకర్షించింది. అరుదుగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతిభ కనబర్చిన కుమార్తెను సిరివెన్నెలను చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.


మొదలైంది ఇలా..

పర్వతారోహణకు విద్యార్థులను ఎంపిక చేయాలని గత సెప్టెంబర్‌ నెలలో సుదిమళ్ల గిరిజన గురుకులానికి సమాచారం అందింది. ప్రిన్సిపల్‌ ఆరుణకుమారి, ఉపాధ్యాయులు, పీఈటీలతో సమావేశం నిర్వహించారు. పర్వతారోహణకు 8, 9, 10 తరగతుల విద్యార్థులను పంపాలనే నిబంధన ఉండటంతో అదృష్టం సిరివెన్నెలను వరించింది. మంచి శరీర ధారుడ్యం, క్రమశిక్షణ కలిగిన సిరివెన్నెలను సరైన విద్యార్థిగా ఎంపిక చేశారు. వెంటనే నల్గొండ జిల్లా భువనగిరిలో రాక్‌ ైక్టెంబింగ్‌ స్కూల్‌లో శిక్షణ ఇప్పించారు. అక్కడ అన్నింటా సిరివెన్నెల మొదటి స్థానంలో నిలిచింది. ఫలితంగా కిలిమాంజారో పర్వతారోహణకు అవకాశం వచ్చింది.


 ప్రయాణం ఎలా సాగిందంటే.. సిరివెన్నెల మాటల్లోనే..

గురుకులం నుంచి ఈ నెల 17వ తేదీన బయలు దేరాను. 20న 12 మంది బృందంతో దక్షిణాఫ్రికా కిలిమాంజారో పర్వతాల వద్దకు చేరుకున్నాం. అక్కడ ప్రత్యేకంగా ఎంపిక చేసిన ప్రాంతంలో వసతి తీసుకున్నాం. ఇక్కడ మాకు పర్వతారోహణపై అవగాహన కల్పించారు. 21న మా ప్రయాణం ప్రారంభమైంది. మొత్తం 8 కిలోమీటర్లు ప్రయాణం చేసి విశ్రాంతి తీసుకున్నాం. రెండో రోజు 11కిలోమీటరుల ప్రయాణం చేశాం. మూడో రోజు అర్థరాత్రి 12 గంటలకు ప్రయాణం ప్రారంభించి 25 కిలోమీటర్లు ప్రయాణం చేశాం. 24న ఉదయం పది గంటలకు కిలిమాంజారో పర్వత శ్రేణుల పైకి చేరుకున్నాం. మొదటి రెండు రోజులు చలి అనిపించినా మూడో రోజు చలి తీవ్రత బాగా కనిపించింది. ఇక్కడ శరీరం చలికి ఎలా తట్టుకుంటుందనే విషయంపై అవగాహన కల్పించారు. మానసికంగా మమ్ముల్ని సిద్ధం చేశారు. ఎంతగానో శ్రమించి పర్వతారోహణ పూర్తిచేసిన వారిలో నేనే ప్రథమురాలిని. తెలంగాణ రాష్ట్ర చిత్రపటాన్ని, సీఎం కేసీఆర్‌ చిత్రపటాన్ని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ చిత్రపటాన్ని పర్వత శ్రేణులపై పెట్టి జై తెలంగాణ అంటూ నినదించాం. పర్వత శ్రేణి మొత్తంగా 5895 మీటర్లు ఉంటుంది. పర్వత శ్రేణికి పై భాగానికి చేరుకున్నాక మా ఆనందానికి అవథులు లేవు.


సిరివెన్నెలకు ఘనస్వాగతం

దక్షిణాఫ్రికాలోని కిలిమాంజారో పర్వతాన్ని అదిరోహించి మంగళవారం ఇల్లెందుకు చేరుకున్న ఈసం సిరివెన్నెలకు ఘనస్వాగతం లభించింది. గురుకుల పాఠశాలల ఆర్‌ఎల్‌సీ ఎస్‌కె బురాన్‌, ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఓపెన్‌ టాప్‌ జీపులో ఊరేగింపుగా పాఠశాలకు తీసుకెళ్లారు. దారిపొడవునా పూలు చల్లుతూ తమ తోటి విద్యార్థిని చూపిన ప్రతిభను నినాదాలతో ప్రపంచానికి చాటి చెప్పారు. సిరివెన్నెల సాధించిన ప్రతిభకు మెచ్చి పట్టణ, మండల ప్రజలు ఆమెకు పుష్పగుచ్చం అందించి అభినందించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిరివెన్నెలను ఘనంగా సన్మానించారు.


 ఖమ్మం  జిల్లాలోని నేలకొండపల్లిలో లింగనమంత్రి,కామాంబ  దంపతులకు మాఘ శుద్ధ తదియ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 1620 లో జన్మించాడు. ఆయనది ఆత్రేయస గోత్రం, రామదాసు భార్య కమలాదేవి, కుమారుడు రఘురాముడు.. ఆయనకు అక్కన్న, మాదన్నలు ఇద్దరు  మేనమామలు. గోల్కొండ నవాబు  తానీషా వద్ద వీరు  మంత్రులుగా ఉండేవారు. వారి సహకారంతోనే గోల్కొండ నవాబు వద్ద రామదాసు తహసీల్దార్‌ ఉద్యోగంలో చేరారు. రఘునాథ భట్టాచార్యుల వద్ద రామదాసు కొంతకాలం శిష్యరికం చేశారని చరిత్ర చెబుతోంది. పాల్వంచ పరగణాలో తహసీల్దార్‌ ఉద్యోగం చేసూ,్త భద్రాచలంలో రామాలయం నిర్మించాడు. దీనికి గాను గొల్కొండ నవాబుల ఆగ్రహానికి గురై 1665 నుంచి 1677 వరకు జైలు జీవితం గడిపాడు.  రామదాసు చెరసాలలో ఉండగా, స్వయంగా శ్రీరాముడే వచ్చి పైకం చెల్లించి విడిపించాడనేది చరిత్ర.. అందుకే ప్రతి ఏటా జరిగే శ్రీరామనవమి కల్యాణానికి రాజదర్బార్‌ నుంచి ముత్యాల తలంబ్రాలు పంపడం ఆనవాయితీగా వచ్చింది. నేటికీ ప్రభుత్వం తరఫునే వీటిని అందజేస్తున్నారు. తన మేనమామలు తానీషా ఆస్థానంలో తహసీల్దార్‌గా ఉద్యోగం ఇప్పించగా, రామునిపై ఉన్న భక్తితో తన స్థానాన్ని భద్రాచలానికి మార్చుకుని, నాటి రోజుల్లో 6లక్షల వరహాలతో పవిత్ర గోదావరి నదీ తీరాన రామమందిరాన్ని నిర్మించాడు. రామునితో పాటుగా సీతమ్మకు, లక్ష్మణుడికి పలు రకాల బంగారు ఆభరణాలు చేయించాడు. ఆ నగలను ప్రత్యేక పూజల సమయంలో దేవతామూర్తులకు అలంకారం చేస్తారు. ‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తలీ’్ల.. అని రామదాసు సీతమ్మను కోరగా రాముడు దర్శనమిచ్చి రామదాసు కోరికపై శ్రీరాముడు తనలో ఐక్యం చేసుకున్నాడు.


నేలకొండపల్లిలో భక్త రామదాసు ధ్యాన మందిరం..

 కంచర్ల గోపన్న స్వగ్రామం నేలకొండపల్లిలో భక్త రామదాసు ధ్యాన మందిరాన్ని 1955 డిసెంబర్‌లో ప్రారంభించి 1961 మార్చిలో పూర్తి చేశారు. ఆ తర్వాత 2000 ఫిబ్రవరి 20న  పునర్నవీకరణ పూర్తి చేయగా,  సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ మందిరంలో వందల సంవత్సరాల కిందటి రామదాసు వాడిన బావి నేటికీ ఉంది. మందిరంలో 1977లో  సీతారాముడు, లక్ష్మణుడు,రామదాసు పంచలోహ విగ్రహాలను ప్రతిష్ఠించారు. భద్రాచలం పాలకమండలి దీని నిర్వహణ బాధ్యతలను  చేపడుతోంది.. రాష్ట్ర ప్రభుత్వం  ఈ రామదాసు స్మారక మందిరాన్ని 3 కోట్ల రూపాయలతో ఆధునీకరించేందుకు  ప్రణాళిక చేసి అమలు చేస్తోంది. ఈమేరకు కళాక్షేత్రం నిర్మాణం కోసం స్థల సేకరణ చేసి కొనుగోలు చేశారు. మందిరాన్ని ఆధునీకరించి, విస్తరింపచేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అమలు చేస్తూ,   రామదాసు కీర్తి ప్రతిష్ఠతలను మరింత  ఇనుమండిపజేస్తోంది. ప్రస్తుతం 6 లక్షల రూపాయల విలువైన 12 అడుగుల రామదాసు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 


రామదాసుకు పట్టు వస్ర్తాలు సమర్పించిన వంశస్తులు

నేలకొండపల్లి : నేటి నుంచి నేలకొండపల్లిలో భక్త రామదాసు ధ్యాన మందిరంలో జయంత్యుత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో రామదాసు పదోతరం వంశస్తులు, కొత్తగూడెం వాసి కంచర్ల శ్రీనివాసరావు దంపతులు మంగళవారం పట్టువస్ర్తాలను సమర్పించారు. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఉత్సవాలకు రామదాసు వంశస్తులు వచ్చి పట్టు వస్ర్తాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది. రామదాసు వంశస్తులు ముందుగా  ధ్యాన మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్ర్తాలను పూజారి సౌమిత్రి రమేష్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్త రామదాసు విద్వత్‌ కళాపీఠం అధ్యక్షుడు సాధు రాధాకృష్ణమూర్తి, పెండ్యాల గోపాలకృష్ణమూర్తి, కాండూరి వేణు, నంచర్ల ప్రసాదు, కర్నాటి శంకర్‌రావు, వాసం లక్ష్మయ్య, మన్నె కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>