గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Jan 28, 2020 , 23:36:48

మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయండి..

మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయండి..

మధిర, నమస్తేతెలంగాణ: రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతా మధులను వారివారి స్వగృహాల్లో మంగళవారం మధిర మున్సిపల్ చైర్‌పర్సన్ మొండితోక లత, వైస్ చైర్ పర్సన్ యరమల విద్యాలత వేర్వేరుగా జడ్పీచైర్మన్ లింగాల కమలరాజుతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన పాలన అంది స్తూ మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి కృషిచేయాలని పేర్కొన్నారు. అనంతరం మధిర మున్సిపల్ చైర్‌పర్సన్ మొండితోక లత మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మధిర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని పేర్కొన్నారు. మధిర మున్సిపాలిటీలో గులాబీజెండా ఎగురవేసే విధంగా కృషిచేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజును టీఆర్‌ఎస్ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి తాతా మధు అభినందిస్తూ స్వీట్లు తిని పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు మొండితోక జయాకర్, శీలం వెంకటరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, వాసిరెడ్డి నాగేశ్వరరావు, రైతుసమన్వయ సమితి సభ్యులు చుంచు విజయ్, ఏఎంసీ చైర్మన్ చావా రామకృష్ణ, మందడపు వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. logo