శనివారం 28 మార్చి 2020
Khammam - Jan 28, 2020 , 22:03:45

దాతల సేవలు అభినందనీయం..

దాతల సేవలు అభినందనీయం..

కల్లూరు:మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించడానికి ముందుకు వచ్చిన ఎన్‌ఆర్‌ఐ కట్టా అంజలి దాతృ త్వం అభినందనీయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. మంగళవారం కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమం లో కట్టా అంజలి ఇచ్చిన రూ.1.63 లక్షలను ఎమ్మె ల్యే సండ్ర వెంకటవీరయ్య ,జడ్పీటీసీ కట్టా అజయ్ కుమార్ చేతుల మీదుగా డీఈవో మదన్‌మో హన్‌కు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జడ్పీటీసీ కట్టా అజయ్ కుమార్ సోదరుడు విజయ్‌కుమార్, సుజాత దంపతుల కుమార్తె అమెరికాలో చదువు తున్న కట్టా అంజలి తన పాకెట్ మనీ పెద్దనాన్న కట్టా అజయ్‌కుమార్ కోరిక మేరకు విద్యార్థుల కోసం అందించినట్లు తెలిపారు. చిన్నారి అంజలి చేసిన దాతృత్వం మరువలే నిదని, ఇదే స్ఫూర్తి జిల్లా అంతటా కొనసాగి ప్రతి విద్యార్థికి దాతల సహకారం అందాలని అభిప్రాయపడ్డారు. మండలంలోని 400 మంది విద్యార్థులకు 40 రోజుల పాటు అల్పాహారం కోసం సాయం చేసిన చిన్నారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. డీఈవో మదన్ మోహన్ మాట్లాడుతూ పది విద్యార్థుల కోసం సాయంత్రం ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని, ఆ సమయంలో వారికి కావాల్సిన అల్పా హారాన్ని అందించడానికి ముందుకు వచ్చిన చిన్నారి అంజలిని అభినం దించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో రాములు, ఎంపీపీ బీరవల్లి రఘు,తల్లాడ జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, తల్లాడ ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణరావు, కల్లూరు, తల్లాడ, పెనుబల్లి మండలాల టీఆర్‌ఎస్ అధ్యక్షులు పాలెపు రామా రావు, కనగాల వెంకట్రావు, రెడ్డెం వీరమోహనరెడ్డి, నాయకులు రాయల శేషగిరిరావు, అత్తునూరి రంగారెడ్డి, లక్కినేని రఘు, లక్కినేని కృష్ణ, కాటంనేని వెంకటేశ్వరరావు, బోబోలు లక్ష్మణరావు, దేవరపల్లి భాస్కరరావు, నర్వనేని అంజయ్య,కొరకొప్పు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


logo