బుధవారం 08 ఏప్రిల్ 2020
Khammam - Jan 28, 2020 , 00:03:02

ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌దే విజయం

ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌దే విజయం

వైరారూరల్‌: రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌దే విజయమని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైరా మున్సిపాలిటీ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, వైస్‌ చైర్మన్‌ ముళ్ళపాటి సీతారాములుకు సోమవారం వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌తో కలిసి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మిఠాయిలు తినిపించి అభినందించారు. అనంతరం వారికి శాలువా కప్పి పూలమాలలు వేసి సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు, స్థానిక సంస్థలు, మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించిందన్నారు. నూతనంగా ఏర్పడిన వైరా మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అన్నదమ్ముల్లా అందరూ పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేశారన్నారు. నాయకులు, కార్యకర్తల కృషితోనే వైరాలోని 15 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారని చెప్పారు. నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రాములునాయక్‌ కృషితో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపొందిందని పేర్కొన్నారు. మాజీ ఎంపీ క్యాంపు కార్యాలయం ఇంచార్జి దయాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు బొర్రా రాజశేఖర్‌, వైరా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, వైరా, కొణిజర్ల మండలాల అధ్యక్షులు పసుపులేటి మోహన్‌రావు, కోసూరి శ్రీనివాసరావు, వైరా, కొణిజర్ల మండల ఎంపీపీలు వేల్పుల పావని, గోసు మధు, టీఆర్‌ఎస్‌ నాయకులు మిట్టపల్లి నాగి, ధార్న రాజశేఖర్‌, మోరంపూడి ప్రసాద్‌, షేక్‌ బీబా, షేక్‌ రహీం, కొనకంచి మోషా పాల్గొన్నారు.


logo