మంగళవారం 31 మార్చి 2020
Khammam - Jan 28, 2020 , 00:03:02

మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి

మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి

వైరా, నమస్తే తెలంగాణ: మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని వైరా ఎమ్మెల్యే లా వుడ్యా రాములునాయక్‌ అన్నారు. మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం చైర్మన్‌ సూతకాని జైపాల్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాములునాయక్‌ మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ఓటర్లు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారని చెప్పారు.  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు భారతదేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 15 మంది కౌన్సిలర్లు గెలుపొందడం అభినందనీయమన్నారు. వైరా మున్సిపాలిటీ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని కొనియాడారు. ప్రభుత్వం వైరా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.20కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ఆ నిధులతో పనులు ప్రారంభించేందుకు ఇటీవల మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. అతి త్వరలో మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులను ప్రారంభిస్తామన్నారు.  వైరా మున్సిపాలిటీని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గం ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేయాలని సూచించారు. వైస్‌ చైర్మన్‌ ముళ్ళపాటి సీతారాములు, కౌన్సిలర్లు మరికంటి డేడికుమారి, బత్తుల గీత, ఏదునూరి పద్మజ, మాదినేని సునీత, లగడపాటి లక్ష్మీరాజ్యం, ఫణితి ఉష, కన్నెగంటి సునీత, సూర్యదేవర వింద్యారాణి, కర్నాటి నందిని, దారెల్లి పవిత్రకుమారి, వనమా విశ్వేశ్వరరావు, దారెల్లి కోటయ్య, గుడిపూడి సురేష్‌కుమార్‌, చల్లగొండ్ల నాగేశ్వరరావు, తడికమళ్ళ నాగేశ్వరరావు, ధనేకుల వేణు, ఇమ్మడి రామారావు, గుగులోత్‌ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>