గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Jan 27, 2020 , 23:59:55

వైరాలో ప్రమాణ స్వీకార మహోత్సవం

వైరాలో ప్రమాణ స్వీకార మహోత్సవం

వైరా, నమస్తే తెలంగాణ: వైరా మున్సిపాలిటీలో తొలిసారి జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్ల ప్రమాణస్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది. వైరాలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 11గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు. వైరా మున్సిపాలిటీ ఎన్నికల స్పెషల్‌ ఆఫీసర్‌, సబ్‌ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి 20 మంది కౌన్సిలర్లతో తెలుగు అక్షరమాల ప్రకారం ప్రమాణస్వీకారం చేయించారు. వైరా 1వ వార్డు కౌన్సిలర్‌గా మరికంటి డేడికుమారి, 2వ వార్డు కౌన్సిలర్‌గా బత్తుల గీత, 3వ వార్డు కౌన్సిలర్‌గా ఏదునూరి పద్మజ, 4వ వార్డు కౌన్సిలర్‌గా సూతకాని జైపాల్‌, 5వ వార్డు కౌన్సిలర్‌గా మాదినేని సునీత, 6వ వార్డు కౌన్సిలర్‌గా లగడపాటి లక్ష్మీరాజ్యం, 7వ వార్డు కౌన్సిలర్‌గా ఫణితి ఉష, 8వ వార్డు కౌన్సిలర్‌గా కన్నెగంటి సునీత, 9వ వార్డు కౌన్సిలర్‌గా సూర్యదేవర వింద్యారాణి, 10వ వార్డు కౌన్సిలర్‌గా కర్నాటి నందిని, 11వ వార్డు కౌన్సిలర్‌గా దారెల్లి పవిత్రకుమారి, 12వ వార్డు కౌన్సిలర్‌గా వనమా విశ్వేశ్వరరావు, 13వ వార్డు కౌన్సిలర్‌గా ముళ్ళపాటి సీతారాములు, 14వ వార్డు కౌన్సిలర్‌గా దారెల్లి కోటయ్య, 15వ వార్డు కౌన్సిలర్‌గా గుడిపూడి సురేష్‌కుమార్‌, 16వ వార్డు కౌన్సిలర్‌గా చల్లగుండ్ల నాగేశ్వరరావు, 17వ వార్డు కౌన్సిలర్‌గా తడికమళ్ళ నాగేశ్వరరావు, 18వ వార్డు కౌన్సిలర్‌గా ధనేకుల వేణు, 19వ వార్డు కౌన్సిలర్‌గా ఇమ్మడి రామారావు, 20వ వార్డు కౌన్సిలర్‌గా గుగులోత్‌ లక్ష్మీబాయి ప్రమాణస్వీకారం చేశారు. అదేవిధంగా ఎక్స్‌ ఆఫీసియో సభ్యుడుగా  ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన కౌన్సిలర్లకు ఎమ్మెల్యే రాములునాయక్‌, సబ్‌ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. వైరా మున్సిపల్‌ కమిషనర్‌ విజయానంద్‌, వైరా తహసీల్దార్‌ హలావత్‌ రంగా పాల్గొన్నారు.


logo