బుధవారం 01 ఏప్రిల్ 2020
Khammam - Jan 27, 2020 ,

సంక్షేమంలో ఖమ్మం ముందంజ

సంక్షేమంలో ఖమ్మం ముందంజ
  • పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధికి శ్రీకారం
  • మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్‌ రహదారుల నిర్మాణాలు
  • ఖమ్మం నగర పాలక సంస్థలో రూ.400కోట్లతో అభివృద్ధి పనులు
  • గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ కర్ణన్‌

ఖమ్మం నమస్తే తెలంగాణ:తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ అన్నారు. ఆదివారం ఖమ్మం పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, స్వాతంత్య్ర సమరయోధుల సమక్షంలో కలెక్టర్‌ ఆర్‌వీకర్ణన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్కార్‌ ప్రవేశపెట్టిన ప్రతీ పథకం సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు వాటి ఫలాలను అర్హులందరికీ అందించి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం లక్ష్మణ్‌, పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, నగర మేయర్‌ పాపాలాల్‌, పాలేరు, సత్తుపల్లి ఎమ్మెల్యేలు ఉపేందర్‌రెడ్డి, వెంకటవీరయ్య, రాములునాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>