శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Khammam - Jan 27, 2020 , 01:46:03

మంత్రి అజయ్‌కు అభినందనలు..

మంత్రి అజయ్‌కు అభినందనలు..

మున్సిపల్‌ ఎన్నికల్లో విజయంపై పువ్వాడను అభినందించిన మంత్రి కేటీఆర్‌

 ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం  ఐదు మున్సిపాలిటీలు గెలుచుకున్న సం దర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు,మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అభినందించారు.ఆదివారం మంత్రి పు వ్వా డ యువనేత కేటీఆర్‌ను హైదరాబాద్‌లో మ ర్యాదపూర్వకంగా కలిశారు.మున్సిపల్‌ ఎన్నికల్లో  ఉ మ్మడి ఖమ్మం జిల్లాను స్వీప్‌ చేయడం పట్ల ఆ యన హర్షం వ్యక్తం చేశారు.గెలుపునకు కృషి చేసిన శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, బాణోత్‌ హరిప్రియా నాయక్‌, లావుడ్యా రాముల్‌ నాయక్‌, సండ్ర వెంకటవీరయ్య, పార్లమెంట్‌ సభ్యులు నామా నాగేశ్వరరావు, మాలోత్‌ కవిత, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ పార్లమెంట్‌ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , పార్టీ రాష్ట్ర కార్యదర్శులు తాతా మధు, నూకల నరేష్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ బాధ్యులు, ఇన్‌చార్జిలకు యువనేత, మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.


logo