గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Jan 27, 2020 ,

క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ

క్యాంపు కార్యాలయంలో  జాతీయ జెండాను  ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం, నమస్తే తెలంగాణ:71వ గణతంత్ర దినోత్సవం సందర్భం గా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఖమ్మం వీడీవోస్‌ కాలనీ క్యాంపు కార్యాలయంలో  ఆదివారం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ భారతదేశం యావత్‌ ప్రపంచంలోనే అతిగొప్ప ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతుండడం ఈ దేశ పౌరులుగా మనందరికీ గర్వకారణమన్నారు. రాష్ట్ర మంత్రిగా తొలిసారి గణతంత్ర దినోత్సవం లో పాల్గొనడం తనకు జీవితాంతం గుర్తుండే గొప్ప అనుభూతి అన్నారు. ప్రేమాభిమానాలకు మారుపేరైన తెలంగాణ ప్రజలతో, ప్రగతి కాముక తెలంగాణ రాష్ట్రంలో ఈ అపూర్వ సందర్భాన్ని గడపడం ఆనందాన్ని రెట్టింపు చేసిందన్నారు. నాకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ, దార్శనిక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అసంఖ్యాక సవాళ్లను అధిగమించిదని, సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం సృష్టిం చిన అగాథం నుంచి తెలంగాణ వేగంగా కోలుకుంటుదన్నారు. అతి స్వల్ప వ్యవధిలోనే అనేక రంగాల్లో అద్భుత విజయాలు సా ధించి, నేడు దేశానికే  తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. అనుకున్న లక్ష్యాలను సాధించే  క్రమం లో గడిచిన ఆరేళ్లలో బలమైన పునాదులు నిర్మించుకుని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కొనసా గించడం వారి పాలనకు దార్శనికత అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎంతో సానుకూల దృక్పథంతో, రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ తెలంగాణ రాష్ట్రం తనకు తానుగా పరివర్తన చెందుతూనే, ప్రజాస్వామ్య-గణతంత్ర భారతదేశంలో గుణాత్మక మార్పులకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. సరికొత్త సం స్కరణలతో పాలనా రంగంలో కొత్తపుంతలు తొక్కుతున్నదని పాలనా సంస్కరణలు స్వరాష్ట్రంలో సుపరిపాలన అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రగతికి ప్రధాన అడ్డంకులైన అవినీతిని, జాప్యాన్ని తరిమికొట్టి పల్లెలు, పట్టణాల రూపురేఖలు మార్చాలని సంకల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల విస్తృత భాగస్వామ్యంతోనే అన్ని నిర్ణయాలు జరగాలని నిర్ణ యం తీసుకున్నారు. ప్రతి పైసా సద్వినియోగం కావాలి... పల్లెలు పట్టణాలు పచ్చని చెట్లతో కళకళలాడాలి అని ప్రతి చో టా పరిశుభ్రత వెల్లివిరియాలని భావించి పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టారని వివరించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఇలా ప్రతి ఒక్కరూ ఎవరి బాధ్యతలు వారు గుర్తెరిగి విధుల పట్ల ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించే పరిస్థితి ఉండొద్దని పటిష్ట చర్యలు తీసుకున్నారన్నారు. గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో జవాబుదారీతనం, ప్రజల భాగస్వామ్యం పెంచడానికి ప్రభుత్వం కొత్త పంచాయతీ రాజ్‌ చట్టాన్ని, కొత్త మున్సిపల్‌ చట్టాన్ని తీసుకురాబోతుందని, ఈ చట్టాల ప్రకారమే అత్యంత కట్టుదిట్టంగా పాలన జరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకుందన్నారు. పల్లె ప్రగతి తెలంగాణ పల్లెలను దేశంలోకెల్లా ఆదర్శగ్రామాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్ర భుత్వం నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు పోతుందని ప్రజల భాగస్వామ్యంతో పల్లెలను బాగు చేసుకునే ఒరవడి అలావాటు కావడం కోసం ఇప్పటికే రెండు విడతలుగా పల్లె ప్రగతి కార్యక్రమం అమలైందన్నారు. ఏ ఊరి ప్రజలే ఆ ఊరికి కథా నాయకులు కావాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపును ప్రజలు అందుకుని చేయిచేయి కలిపి శ్రమదానం చేసి, సమష్టి కృషితో ఎవరి గ్రామాన్ని వారు అద్దంలా తీర్చిదిద్దుకోవడం శుభపరిణామం అని వ్యాఖ్యానించారు. రోడ్లు, డ్రైనేజీలు శుభ్రం చేసుకున్నారు. ముళ్ల కంచెలను, మురికి గుంటలను, పాత ఇండ్ల శిథిలాలను తొలగించుకున్నారు. స్మశాన వాటికల నిర్మాణానికి, డంపు యార్డుల ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేసుకున్నారు. గ్రా మాల్లో పవర్‌ వీక్‌ నిర్వహించుకుని, వంగిన కరెంటు పోళ్లను, వేలాడే కరెంటు వైర్లను  సరిచేసుకు న్నారు. అవసరాలు-వనరుల ప్రాతిపదికగా వార్షిక, పంచవర్ష ప్రణాళికలు తయారు చేసుకున్నారు. దాని ప్రకారమే నిధులు ఖర్చు పెట్టే సంప్రదాయం ప్రారంభమయ్యింది. పల్లె ప్రగతి కార్యక్రమం అమలుకు ముందు, తరువాత గ్రామాల్లో ఎంతో మార్పు స్పష్టంగా తెలుస్తుందన్నారు. మన ఊరిని మనమే బాగు చేసుకోవాలనే చైతన్యం పొందినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్పూర్తిని మున్ముందు కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నాని, పట్టణ ప్రగతి తెలంగాణ రాష్ట్రంలో పట్టణీకరణ శరవేగంగా జరుగుతుందని, దాదాపు సగం మంది జనాభా పట్టణాల్లోనే జీవిస్తున్నారని అన్నారు. పట్టణాల రూపురేఖలు కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో నిర్దేశించిన పనులన్నీ సకాలంలో విజ య వంతంగా పూర్తి చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో పలువరు కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>