సోమవారం 06 ఏప్రిల్ 2020
Khammam - Jan 27, 2020 ,

టీఆర్‌ఎస్‌ నుంచి మడత వెంకట్‌గౌడ్‌ శాశ్వత బహిష్కరణ

టీఆర్‌ఎస్‌ నుంచి మడత వెంకట్‌గౌడ్‌ శాశ్వత బహిష్కరణ

ఖమ్మం నమస్తేతెలంగాణ:ఇల్లెందు మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆదేశాలను ధిక్కరించిన మడత వెంకట్‌గౌడ్‌ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నట్లు పార్టీ వర్కింగ్‌ ప్రెసి డెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉంటూనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులలో వెంకట్‌గౌడ్‌తో పాటు మడత రమ, కోరం సురేందర్‌, బానోత్‌ భద్రు, తాటి భిక్షమయ్యలను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు.పార్టీ ఆదేశాలను విభేదించి పార్టీ అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా బరిలో నిలిపి పార్టీ విజయ అవకాశాలను దెబ్బ తీసేం దుకు ప్రయత్నం చేశారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి పార్టీకి వెన్ను పోటు పొడిచిన వీరిని పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నట్లు  కేటీఆర్‌ వెల్లడించారు.


logo