గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Jan 27, 2020 ,

మహానీయుల జీవితాలు అందరికీ ఆదర్శం

మహానీయుల జీవితాలు  అందరికీ ఆదర్శం
  • పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి

కూసుమంచి:భారతదేశం నేడు ఇంత స్వేచ్ఛగా  ఉండ టానికి తమ ప్రాణాలను ఫణంగా పెట్టి స్వాతత్య్రం  సాధిం చిన  మహానీయుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావా లని పాలేరు శాసన సభ్యులు కందాల ఉపేందర్‌రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా జా తీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో అందరూ సంతోషంగా ఉండాలని ప్రభుత్వ ఫ లాలు ప్రతి ఒక్కరికీ అందాలని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా అందరూ బాధ్యత తీసుకోవాలని ప్రజలను కార్య కర్తలను కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ వైస్‌ ఎంపీపీ మరికంటి ధనలక్ష్మీ, జడ్పీటీసీ ఇంటూరి బేబీశేఖర్‌, ఎంపీపీ బాణోత్‌ శ్రీనివాస్‌, తిరుమలాయపాలెం ఎంపీపీ బోడా మం గీ లాల్‌, రూరల్‌ జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్‌, మండల పార్టీ అధ్యక్షులు రామసహా యం బాలకృష్ణారెడ్డి, బెల్లం వేణు, ఉన్నం బ్రహ్మయ్య, బాషబోయిన వీరన్న మండల పార్టీ కార్యదర్శులు, పార్టీ నాయకులు ఇంటూరి శేఖర్‌, మల్లీడి వెంకటేశ్వర్లు, చావా వేణు, వడ్త్యి రామచంద్రనాయక్‌, కొప్పుల అశోక్‌,చాట్ల పరశురాం,బాలూనాయక్‌,వంచర్ల సత్య నారాయణరెడ్డి, వంశీ కృష్ణ,నంబూరి సత్యనారాయణ పాల్గొన్నారు. logo
>>>>>>