శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Khammam - Jan 26, 2020 , 00:51:34

సీఎం కేసీఆర్‌ పాలనకు ప్రజల మద్దతు

సీఎం కేసీఆర్‌ పాలనకు ప్రజల మద్దతు
  • -ఎన్నికల కోసం కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు
  • -మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
  • -టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో సంబురాలు


మామిళ్లగూడెం, జనవరి 25 : టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితోనే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఘన విజయాన్ని సాధించామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. పురపాలక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంత్రి హర్షాన్ని వ్యక్తం చేస్తూ గెలుపునకు కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీకే ప్రజలు మరోసారి జై కొట్టారని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని అబద్ధ్దాలు చెప్పినా రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనకు ప్రజలు సంపూర్ణ మద్దతును ప్రకటించి తెలంగాణ అభివృద్ధికి విజయ బాటలు వేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర టీఆర్‌ఎస్‌ కార్యనిర్వహక అధ్యక్షులు, యువనేత మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులు శరవేగంగా  జరుగుతున్నాయని పేర్కొన్నారు.  జిల్లాలో కంచుకోట పార్టీలంటూ ప్రచారం చేసుకున్న కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రజల మనుస్సులను తెలుసుకొని రాజకీయాలు చేయాలని సూచించారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారే తప్పా రాజకీయాలతో వెనుకబాటు తనాన్ని కోరకోవడం లేదన్నారు. జిల్లాలో ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకులు ప్రజలను కులాలు, మతాల మధ్య వైశ్యామ్యాలను రెచ్చగోట్టే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు ఎంతో సహనంతో ఓర్పుగా తమ ఓటు చైతన్యంతో వారికి బుద్ది చెప్పారన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి మున్సిపాలిటీలో అన్ని వార్డులలో ఏకపక్షంగా విజయం సాధించామన్నారు. వైరా మున్సిపాలిటీలోనూ స్పష్టమైన మెజార్టీతో 15 వార్డులను కైవసం చేసుకుని వైరా మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ జెండాను ఎగరవేశామన్నారు. మధిర మున్సిపాలిటీలో ప్రతి పక్షాలు  కుట్రలు, కుతంత్రాలతో టీఆర్‌ఎస్‌పై అబద్ధపు ప్రచారాలు చేసినప్పటికీ ప్రజలు 13 వార్డుల్లో విజయాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు. ఇల్లెందు మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ను దొంగదెబ్బతీసేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్షాల ఎత్తులు అక్కడ ప్రజలు సహించలేదన్నారు. ప్రతిపక్షాలకు ఓటు ద్వారా బుద్ధి చెప్పిన ప్రజలు టీఆర్‌ఎస్‌కు 19 వార్డులను గెలిపించి బహుమతిగా అందించారని తెలిపారు. కొత్తగూడెం మున్సిపాలిటీలోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ 25 వార్డులను గెలుచుకుని తిరుగులేని విజయాన్ని సాధించిందని తెలిపారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరుపున గెలిచిన అభ్యర్థులందరికి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రత్యేక అభినందనలు తెలుపుతుందన్నారు. గెలిచిన అన్ని మున్సిపాలిటీలలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎంపికను ముఖ్యమంత్రి కేసీఆర్‌, యువనేత కేటీఆర్‌ సూచనలు, వారి సలహాల మేరకే జరుగుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, మేయర్‌ పాపాలాల్‌,  టీఆర్‌ఎస్‌ పార్టీ నగర అధ్యక్షులు కమర్తపు మురళీ, మాజీ ఏఎంసీ చైర్మన్‌ ఆర్‌జేసీ కృష్ణ, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళీ ప్రసాద్‌, రైతుసంఘం జిల్లా సమన్వయకర్త నల్లమల్ల వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు పగడాల నాగరాజు, టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లు పద్మ, రూరల్‌ మండలం అధ్యక్షులు బెల్లం వేణు, టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ నగర అధ్యక్షులు హెచ్‌ ప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకురాలు తన్నీరు శోభారాణి, టీఆర్‌ఎస్‌ నాయకులు బుర్రి వినయ్‌కుమార్‌, పొన్నం వెంకటేశ్వర్లు, భాస్కర్‌, నాగబత్తిని కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో సంబురాలు..

పురపాలక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడంతో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం అనంతరం కార్యకర్తలు, నాయకులు సంబురాలను జరుపుకున్నారు. కార్యాలయంలో మిఠాయిలను పంచుకుని అభినందనలు తెలుపుతున్నారు. గులాబీ రంగులు చల్లుకుని బాణాసంచను పేల్చి జై తెలంగాణ నినాదాలు చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ  రాష్ట్రం  మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆకాంక్షించారు.logo