మంగళవారం 31 మార్చి 2020
Khammam - Jan 26, 2020 , 00:50:23

ఓటే వజ్రాయుధం..

ఓటే వజ్రాయుధం..
  • -ఓటు హక్కును ప్రతిఒకరూ వినియోగించుకోవాలి..
  • -జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం లక్ష్మణ్‌
  • -జిల్లాకు తెలంగాణ రాష్ట్ర డెమోక్రసీ అవార్డు
  • -కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌
  • -ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం
  • -పలువురు సీనియర్‌ సిటిజన్స్‌కు సన్మానం

ఖమ్మం నమస్తే తెలంగాణ  : ప్రజాస్వామ్యంలో రాజ్యాంగపరంగా కల్పించబడిన ఓటుహక్కును అర్హులైన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి యం లక్ష్మణ్‌ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి ర్యాలీని ప్రారంభించారు.అనంతరం భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవటమే జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రధాన ఉద్దేశమన్నారు. నిరక్షరాస్యులు ఓపికతో ఓటరు వరసలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, యువత కూడా ఓపిక, సహనం అలవర్చుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు మొదలుకొని బూత్‌లెవల్‌ అధికారుల వరకు ప్రతి ఒక్కరూ తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించడం ద్వారా ఇటీవలె మన జిల్లాకు తెలంగాణ రాష్ట్ర డెమోక్రసీ అవార్డు లభించిందని కలెక్టర్‌ తెలిపారు.  జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరానికి చెందిన సీనియర్‌ సిటిజన్స్‌ కాపర్తి సావిత్రమ్మ, ఎస్‌కే. రంజాన్‌ అలీను ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, కలెక్టర్‌ ఘనంగా సన్మానించారు. అదేవిధంగా నూతనంగా తమ పేరును ఓటరుగా నమోదు చేసుకున్న యువతీ యువకులకు ఎపిక్‌ కార్డులను అందజేశారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వపోటీల విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఉత్తమ బూత్‌లెవల్‌ అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పాలేరు ఈఆర్‌ఓఆర్‌ దశరథ్‌, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ మాలతీ, జిల్లా సంక్షేమాధికారి సబిత, జిల్లా పర్యాటక శాఖాధికారి సుమన్‌ చక్రవర్తి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పరందామరెడ్డి, అర్బన్‌, రూరల్‌ తహశీల్దారు శ్రీనివాస్‌, శ్రీనివాసరావు, కలెక్టరేట్‌ కార్యాలయపు పరిపాలనాధికారి మదన్‌గోపాల్‌, ఎన్నికల విభాగపు డిప్యూటీ తహసీల్దారు రాంబాబు, వివిధ పాఠశాల, కళాశాలల విద్యార్థ్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. logo
>>>>>>