శనివారం 04 ఏప్రిల్ 2020
Khammam - Jan 24, 2020 , 00:55:40

‘పల్లెప్రగతి’ పనులు త్వరగా పూర్తి చేయాలి

‘పల్లెప్రగతి’ పనులు త్వరగా పూర్తి చేయాలి
  • -ఎంపీడీఓలు ప్రతి రోజు తనిఖీలు చేపట్టాలి
  • -వారం రోజుల్లో పురోగతి కనిపించాలి
  • -అధికారుల సమావేశంలో కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ఖమ్మం నమస్తేతెలంగాణ : పల్లె ప్రగతి పనులపై ప్రత్యేక దృష్టి సారించి పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ అధికాలను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పల్లె ప్రగతి పనులపై కలెక్టర్‌ సమీక్షంచారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మండల పరిధిలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రతిపనిపై ఎంపీడీఓలు సమగ్ర అవగహన కలిగి ఉండాలన్నారు. పల్లెప్రగతిలో గుర్తించిన వైకుంఠదామాలు, డంపింగ్‌ యార్డులు, పెండింగ్‌ పనులను త్వరగా పూర్తిచేసి వివరాలను అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. పల్లె ప్రగతి పనులను తనిఖీ చేసేందుకు ఫ్లయ్యింగ్‌ స్కాడ్‌ అధికారుల బృందం గ్రామాల్లో పర్యటిస్తుందని పెండింగ్‌ పనులు ఉన్నయెడల సంబంధిత ఎంపీడీఓలు బాధ్యులు అవుతారని తెలిపారు. పంచాయితీరాజ్‌ ద్వారా చేపట్టిన పనులన్నీ సత్వరమే అఫ్‌లోడ్‌ చేయాలన్నారు. చేసిన పనులను అప్‌లోడ్‌ చేయకపోవడం వలన ర్యాంకింగ్‌లో వెనుకంజలో ఉంటున్నామని తెలిపారు. ఇంకుడుగుంతల పనులు ఇంకా కొన్ని మండలాల్లో పెండింగ్‌లో ఉన్నాయని ఎంపీఓలు, పంచాయితీ కార్యదర్శులు అట్టి పనుల బాధ్యతను అప్పగించి ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పనులను ప్రతిరోజు తనిఖీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. నర్సరీలపై ప్రత్యేక దృష్టి సారించి పనులు పూర్తిచేసి వారం రోజుల్లో పురోగతి సాధించాలన్నారు.

నర్సరీల నిర్వహణకు ఎంపీఓలు ఇంకుడు గుంతల నిర్మాణం పనులకు ఎంపీఓలు, ఈపీఆర్‌డీలు, వైకుఠదామాల పనులకు పంచాయితీరాజ్‌ ఏఇ లు, డంపింగ్‌ యార్డ్‌ పనులకు ఎంనీఓలను బాధ్యులుగా చేసి పనులపై ఎంపీడీఓలు పర్యవేక్షించాలని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామ పంచాయితీలకు కొనుగోలు చేసిన ట్రాక్టర్ల ద్వారా ఇంటింటికి చెత్త సేకరణ జరగాలని వేర్వేరుగా సేకరించిన తడి, పొడి చెత్తను డంపింగ్‌ యార్డుల్లో నిర్మించిన షెడ్‌లకు తరలించి కంపోస్ట్‌ తయారు చేసేందుకు స్వయం సహాయక బృందాలకు వ్యవసాయ అధికారుల ద్వారా ప్రత్యేక శిక్షణ నివ్వాలని జిల్లా పంచాయితీ అధికారిని ఆదేశించారు. ట్రాక్టర్లు కొనుగోలు చేయని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఎంపీడీఓలను ఆదేశించారు. బ్యాంకర్లతో సమస్య వస్తే లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌తో పాటు ప్రత్యేకంగా నియమించబడిన బ్యాంకు అధికారిని సంప్రదించాలని సూచించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ హన్మంతు కొడింబా, శిక్షణ కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, జడ్పీ సీఈఓ ప్రియాంక, జిల్లా పంచాయతీ అధికారి కె. శ్రీఈనివాసరెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బి ఇందుమతి, పంచాయితీరాజ్‌ ఎస్‌ఇ సీతారాములు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌రావు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, ఎంపీడీఓలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు.logo