మంగళవారం 31 మార్చి 2020
Khammam - Jan 24, 2020 , 00:55:40

అభివృద్ధి పనుల్లో ఆంధ్రా కూలీలు

అభివృద్ధి పనుల్లో ఆంధ్రా కూలీలు
  • -పొట్టకూటి కోసం సరిహద్దు దాటి..
  • -గ్రామాల్లో ఇంకుడు గుంతలు, డ్రైనేజీల నిర్మాణ పనులు
  • -నిత్యం పదుల సంఖ్యలో పలు గ్రామాలకు రాక
  • -ఉపాధి పొందుతున్న వలసకూలీలు

ఇంకుడు గుంతల నిర్మాణాలకు ఆంధ్రా కూలీలు

పొట్టకూటికోసం... సరిహద్దు దాటి..


ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత తీవ్రంగా మారడంతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. దీంతో వారు సరిహద్దు దాటి తెలంగాణ రాష్ట్రంలోని చింతకాని, బోనకల్లు, ముదిగొండ, మధిర తదితర మండలాలకు పొట్టకూటి కోసం వలస బాట పడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో భూగర్బజలాల సంరక్షణే ధ్యేయంగా మొదలు పెట్టిన ఇంకుడు గుంతల నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నది. ఇవే కాక పల్లెల్లో అంతర్గత సిమెంట్‌రోడ్ల నిర్మాణాలు, సైడ్‌ డ్రైనేజీలలో పూడికలు, పంచాయతీ అభివృద్ధి పనులు, పల్లె ప్రగతి ప్రణాళిక-1, 2 ద్వారా గ్రామ పంచాయతీలకు ధారాళంగా నిధులు ఇవ్వడంతో కూలీల అవసరం ఎక్కువైంది. స్థ్ధానికంగా యాసంగి పనులు మొదలవ్వడం, సీజన్‌ ఆరంభంలో వ్యవసాయ పనులు ఎక్కువై స్థ్ధానికంగా కూలీల కొరత ఎక్కువై డిమాండ్‌ ఏర్పడింది. పత్తి తీస్తే కేజీ ఒక్కింటికి రూ.10 రూపాయలు ఇస్తుండడంతో స్థానిక గ్రామాల కూలీలు సైతం పత్తి తీతకు, మొక్కజొన్న గింజలు వేయడానికి వెళ్తున్నారు. దీంతో పల్లె ప్రగతిలో గ్రామాలకు అధికారులు ఇచ్చిన అభివృద్ధి పనుల టార్గెట్‌లు అందుకోవడానికి స్థానిక కూలీలు దొరకకపోవడం, పక్క రాష్ట్రంతో కూలీలు ఖాళీగా ఉండడంతో ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు పక్క మండలాల నుండి కూలీలను తరలిస్తున్నారు. విచిత్రం ఏంటంటే స్ధానిక గ్రామాలలో నివసించే కూలీలు సైతం పక్క రాష్ట్రం నుండి వచ్చిన కూలీలకే ఇంకుడు గుంతల కాంట్రాక్ట్‌ ఇవ్వడం శోచనీయం.  ఎందుకంటే స్ధానికంగా పత్తి తీతలు ముమ్మరం కావడం, మొక్కజోన్న విత్తడానికి అధికంగా కూలి వస్తుండడంతో స్ధానిక కూలీలు ఇతర రాష్ర్టాల కూలీలకు పని కల్పిస్తున్నారు.  అంతేకాకుండా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతుండడంతో పక్క రాష్ట్రం నుంచి కూలీలు ఇక్కడికి వస్తూ ఉపాధి పొందుతున్నారు.

ఖర్చులు పోను రూ.350 వస్తున్నాయి..

ప్రతి రోజు చార్జీల ఖర్చులు పోను రూ.350 ఒక్కో కూలికి  అందుతున్నాయి. ప్రస్తుతం ఇంకుడు గుంతల నిర్మాణం జరుగుతున్నది. రోజుకు ఒక జంట(ఇద్దరం కలసి) ఒక ఇంకుడు గుంత తీస్తున్నాము. ఒక్కో ఇంకుడు గుంతకు రూ.800 స్థానికంగా గృహస్తులు కాంట్రాక్ట్‌గా ఇస్తున్నారు.- బత్తుల శ్రీను


నిత్యం తెలంగాణకు పనికోసం వస్తున్నాం..

మాది వత్సవాయి మండలం. గతంలో సుతారి కూలీ కోసం వెళ్లే వాళ్లం. మా ప్రాంతంలో ఇసుక కొరత ఏర్పడి అభివృద్ధి పనులు ఆగడంతో  పనులకు ప్రతి నిత్యం ఇక్కడికి వస్తున్నాం.
    - చల్లా రమణlogo
>>>>>>